Wednesday, May 1, 2024

ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఆందోళన

- Advertisement -
- Advertisement -

Lok-Sabha

న్యూఢిల్లీ: దేశంలో ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లను నీరుకార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ పార్టమెంట్ లో ఆందోళనకు దిగింది. ఉద్యోగాలు, ప్రమోషన్లు ప్రాథమిక హక్కుకాదన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలను కాంగ్రెస్ సభలో ప్రస్తావించింది. ప్రభుత్వ విధానం చూస్తుంటే రిజర్వేషన్లు తొలగించే పరిస్థితులు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. దీనిపై ప్రభుత్వం అభ్యతరం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నిర్ణయం తమకు ఆపాదించడం సరికాదని, దీనికి సంబందించి మధ్యాహ్నం 2.15 నిమిషాలకు సభలో ప్రకటన చేస్తామని సభ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అటు రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ స్పందించారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ పై తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు. దేశంలో ఈ పార్టీలు రిజర్వేషన్లకు పూర్తిగా వ్యతిరేకమన్నారు. అందుకే వాటిని తొలగించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం బిజెపికి పట్టదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Congress Party Raised in Lok Sabha on SC ST Reservation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News