Saturday, April 27, 2024

మొదలైన సింగరేణి ఎన్నికల ప్రక్రియ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః సింగరేణి గుర్తింపు ఎన్నికల ప్రక్రియ మొదలైంది అక్టోబర్‌లో జరగాల్సిన ఎన్నికలను కోర్టు ఆదేశాలతో వాయిదా వేశారు. తిరిగి ఈనెల 27న నిర్వహించాలని కొద్ది రోజుల క్రితం అన్ని సంఘాల నాయకులతో ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు. ఇదవరకే నామినేషన్ల ప్రక్రియ నిర్వహించి ఉండంటంతో ఓటర్ల జాబితాను కార్మిక సంఘాలకు అప్పగించారు. వీటిలో అభ్యంతరాలు ఉంటే ఎన్నిల అధికారికి దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకుని చివరగా ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. మొత్తం 39,882 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితాను అప్పగించారు. మొత్తం 13 కార్మిక సంఘాల ప్రతినిధులు డిప్యూటీ సిఎల్‌సి అధికారులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వస్తున్న సింగరేణి గుర్తింపు ఎన్నికలు ఈ నెల 27న తప్పకకుండా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

గత అక్టోబర్‌లోనే ఈ ప్రక్రియ జరగాల్సి ఉండగా ఎన్నికల సాధారణ షెడ్యూల్ విడుదల కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. అప్పటికే రెండు సార్లు ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టి వాయిదా వేశారు. గుర్తింపు సంఘం తెలంగాణ బొగ్గు కార్మిక సంఘంతో పాటు యాజమాన్యం కోర్టును ఆశ్రయించడంతో రెండు సార్లు వాయిదా పడింది. గత డిసెంబర్‌లో ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టినప్పటికి పలు కారణాలు చూపుతు వాయిదా వేశారు. గత డిసెంబర్, ఏప్రిల్‌లో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని చెప్పడంతో ఎన్నికలు నిర్వహించలేదు. జూన్‌లో నిర్వహించేందుకు సిద్దమైనా మళ్ళీ వాయిదా వేశారు. చివరకు అక్టోబర్‌లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు దసరా ,దీపావళి పండుగలు, ఎన్నికలు నేపథ్యంలో మరో సారి వాయిదా వేయాల్సి వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమయ్యారు. మొత్తంగా సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాల పరిధిలో గనుల్లో పని చేసే కార్మికుల ఓట్లతో కార్మిక సంఘాల గుర్తింపు, ప్రాతినిద్య హోదానుదక్కించుకోనున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News