Friday, April 26, 2024

21 నుంచి ఎస్‌సిటి ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మార్చి 26న ఎస్‌సీటీ ఎస్‌ఐ టెక్నికల్ పేపర్ రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు మార్చి 21 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థలు మార్చి 21న ఉదయం 8 గంటల నుంచి హాల్‌టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 24న అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు తమ హాల్‌‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

అభ్యర్థులు వెబ్‌సైట్‌లో వివరాలను నమోదుచేసి హాల్ టికెట్లు పొందవచ్చు. ఒకవేళ హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌లో ఏమైనా సమ స్యలు ఏర్పడితే support@tslprb.inకు ఈ మెయిల్ చేయడం ద్వారా లేదా 93937 11110, 93910 05006 నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా సమస్య పరిష్కరించుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. అయితే ఎస్‌సిటి ఎస్‌ఐ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే మిగతా రెండు పేపర్లకు సంబంధించిన హాల్‌టికెట్లను జారీచేయ నున్నట్లు పోలీసు నియామక బోర్డు తెలిపింది.

ఆ హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు సంబంధించిన తేదీలను మరో ప్రకటన ద్వారా తెలియ జేయనున్నట్లు వెల్లడించింది. ఇదిలావుంటే అభ్యర్థులు హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోగానే తప్పనిసరిగా దానిపై సంబంధిత ప్రదేశంలో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అంటించాలని బోర్డు సూచించింది. హాల్‌టికెట్‌పై పాస్ ఫొటో లేకపోతే పరీక్ష హాల్‌లోకి అనుమతించరని స్పష్టం చేసింది.
మెయిన్ పరీక్షల తేదీలివే…
మార్చి 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సిటి ఎస్‌ఐ (పిటిఒ) టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ కానిస్టేబుల్ (డ్రైవర్) డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు టెక్నికల్ పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులకు టెక్నికల్ పేపర్ పరీక్షలు నిర్వహిస్తారు.ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు అర్థమెటిక్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సిటి ఎస్‌ఐ/ఎఎస్‌ఐ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు.

ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సిటి ఎస్‌ఐ (సివిల్) పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సిటి ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు తెలుగు/ఉర్దూ పరీక్ష నిర్వహిస్తారు. ఇక చివరగా ఏప్రిల్ 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సిటి కానిస్టేబుల్ (సివిల్), ఇతర కానిస్టేబుల్ సమాన పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సిటి కానిస్టేబుల్ (ఐటి&సిఒ) పోస్టులకు టెక్నికల్ పరీక్ష్ నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News