Sunday, October 1, 2023

పిఎం శ్రీ పథకానికి రెండో దశ దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రభుత్వ బడులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర విద్యాశాఖ అమలుచేస్తున్న ‘పీఎం శ్రీ స్కూల్స్’ పథకానికి రాష్ట్రం నుంచి దరఖాస్తులు సమర్పించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. మొదటి విడతలో 543 పిఎం శ్రీ పథకం కింద 543 పాఠశాలలు ఎంపిక కాగా, రెండో విడతలో మరిన్ని స్కూళ్లను ఈ పథకం కిందకు తీసుకువచ్చేందుకు దరఖాస్తులు సమర్పించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం కింద పాఠశాలల ఎంపిక ప్రక్రియ ఈ నెల 11వ తేదీన ప్రారంభం కాగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 26 వరకు అవకాశం ఉంది.
4,930 స్కూళ్లను షార్ట్‌లిస్టు చేసిన విద్యాశాఖ
పిఎం శ్రీ పథకం కింద రెండో దశ స్కూళ్ల ఎంపికలో తెలంగాణ రాష్ట్రం నుంచి 4,930 ప్రభుత్వ పాఠశాలలు పోటీపడుతున్నాయి. ఆయా స్కూళ్లను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు షార్ట్‌లిస్ట్ చేశారు. 2021 22 విద్యాసంవత్సరం డాటా ఆధారంగా ఈ స్కూళ్లను షార్ట్‌లిస్టు చేశారు. ఈ పథకంలో భాగంగా బడులను హరిత పాఠశాలలుగా అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం సోలార్ ప్యానళ్లు, ఎల్‌ఈడీ లైట్లు, ప్లాస్టిక్హ్రిత వ్యర్థ పదార్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, పోషకాహార తోటల పెంపకం, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతారు.

పిఎం శ్రీ కింద స్కూళ్ల ఎంపికకు మార్గదర్శకాలు

దరఖాస్తు చేసే బడికి పటిష్ఠమైన పక్కా సొంత భవనం కలిగి ఉండాలి.
పాఠశాలలో ఫైర్ సేఫ్టీ ఉపకరణాలు తప్పనిసరి.
స్కూల్‌లో రాష్ట్ర సగటు కన్నా మించి విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ఉండాలి.
బాల బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల వసతి కలిగి ఉండాలి. కనీసం ఒక ప్రత్యేక టాయిలెట్ తప్పనిసరి.
పాఠశాలలో పోర్టబుల్ తాగునీటి సౌకర్యం ఉండాలి.
పాఠశాలలో ప్రత్యేకంగా హ్యాండ్‌వాష్ సౌకర్యం ఉండాలి
పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరికీ ఫొటో గుర్తింపుకార్డులు ఉండాలి.
పాఠశాల తప్పనిసరిగా విద్యుత్తు సరఫరా ఉండాలి.
బడిలో గ్రంథాలయం లేదా రీడింగ్ కార్నర్, ఆటవస్తువులు ఉండాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News