Saturday, April 27, 2024

స్వల్పంగా పెరిగిన సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల(హై వోలాటిలీ) మధ్య స్వల్ప లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 126.76 పాయింట్లు లేక 0.22 శాతం పెరిగి 57653.86 వద్ద ముగియగా, నిఫ్టీ 40.70 పాయింట్లు లేక 0.24 శాతం పెరిగి 16985.70 వద్ద ముగిసింది. 899 షేర్లు లాభపడగా, 2649 షేర్లు నష్టల్లో ముగిశాయి. కాగా 138 షేర్లు మార్పు లేకుండా ముగిశాయి.

నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సిప్లా, సన్ ఫార్మా, ఎస్‌బిఐ ప్రధానంగా లాభపడగా, అదానీ పోర్ట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్ నష్టపోయాయి. ఇక రంగాల వారీగా చూసినప్పుడు ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, రియాలిటీ 0.5 నుంచి 2 శాతానికి తగ్గాయి. ఫార్మా ఇండెక్స్ 1 శాతం పెరిగింది. ఇక అమెరికా డాలరుతో రూపాయి మారకం స్పాట్ ప్రైస్ రూ. 81.80 నుంచి 82.80 మధ్య చలించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News