Tuesday, May 30, 2023

చేవేళ్లలో ఏడు కార్లు ఢీ….

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఆదివారం రాత్రి కారు ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ కు దారి ఇచ్చే క్రమంలో ఏడు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చేవెళ్ల నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు అంబులెన్స్ కు దారి ఇవ్వడానికి ముందున్న కారు వేగం తగ్గించడంతో వెనుక నుంచి వస్తున్న కార్లు ఢీకొన్నాయి. దీంతో ఏడు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. చేవెళ్ల సిఐ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వాహనాలను పక్కకు తొలగించారు. కార్ల మధ్య కనీస దూరం పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News