Thursday, May 1, 2025

హైదరాబాద్‌లో పలు పోలీసుస్టేషన్ల పేరు మార్పు.. 146 మంది సిఐల బదిలీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పేర్లు మార్చుతూ ఉత్తర్వులు వెలువరించింది. పోలీస్ స్టేషన్ల హద్దుల్లో సమస్యలు ఎదురవడం.. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లపై గందరగోళాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి నివేదిక పంపగా దానికి ఆమోదముద్ర వేసినట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ పేర్కొన్నారు. అదేవిధంగా ప్రఖ్యాత ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని పోలీస్‌స్టేషన్లకు, డివిజన్లకు పేర్లు మార్చినట్టు ఆయన పేర్కొన్నారు. హుమాయన్ నగర్ పోలీసు స్టేషన్‌ను మెహిదీపట్నం పోలీసుస్టేషన్ గా,

సెక్రెటేరియట్ పిఎస్‌ను లేక్ పోలీస్‌స్టేషన్‌గా, షాహీనాయత్ గంజ్ పోలీసుస్టేషన్‌ను గోషామహల్ పోలీ సుస్టేషన్‌గా మార్చినట్టు తెలిపారు. ఇక 72వ లా అండ్ ఆర్డర్ పోలీసుస్టేషన్‌గా టౌలీచౌకీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ‘35 ఏళ్ల తర్వాత హైదరా బాద్ కమిషనరేట్‌లో పోలీసుస్టేషన్‌ల పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. నగరంలో 71 లా అండ్ ఆర్డర్, 31 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. రెండేళ్లుగా పోలీసుస్టేషన్ హద్దుల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసుస్టేషన్‌పై గందరగోళం నెలకొంది. ప్రభుత్వానికి నివేదిక పంపితే మార్పులకు ఆమోదం తెలిపింది. పోలీసుస్టేషన్ల వివరాలను హైదరాబాద్ సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తా’మని సిపి సివి ఆనంద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News