Sunday, April 28, 2024

దృష్టి మరల్చి.. సొత్తు మాయం..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరో: దృష్టి మరల్చి దొంగతనాలు చేస్తున్న ముగ్గురు నిందితులను షాహినాయత్‌గంజ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి లక్ష రూపాయల విలువ గల లాప్టాప్, రూ.4 లక్షల విలువైన డైమండ్ లాకెట్, లక్షన్నర విలువైన చైన్ డైమండ్, రూ.70,000 విలువైన డైమండ్ రింగ్, 30 వేల విలువైన డైమండ్ నోస్ పిన్, 45 వేల విలువైన ఇయర్ రింగ్ తోపాటు 40వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సౌత్ అండ్ వేస్ట్ జోన్ డిసిపి బి. బాలస్వామి షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పాతబస్తీ హుస్సేన్ ఆల కు చెందిన ముజఫర్ బంగారు నగల షాపు యజమాని, డ్రైవర్ తో శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో బషీర్ బాగ్ ప్రాంతానికి కారులో వెళుతుండగా,

బేగంబజార్ ఛత్రి చౌరస్తా వద్ద ఢిల్లీ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు వచ్చి కారు బంపర్ నుంచి వెనుక వైపు ఆయిల్ లీకేవుతుందని తెలపడంతో వెంటనే ముజఫర్ తో పాటు డ్రైవర్ కూడా కిందికి దిగి చూస్తుండగానే ఢిల్లీకి చెందిన పాన్ షాప్ నిర్వహించే రమేష్ కుమార్ (30), లేబర్ రోనక్ (20), శశి కుమార్, (43), ఆజుబాబు, సూరజులు కలిసి కార్ డోర్ తీసి బ్యాగును తీసుకొని పరారయ్యారు. వెంటనే ముజఫర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సిసి కెమెరాల పుటేజ్ ఆధారంగా ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రమేష్ కుమార్, రోనాక్ తో పాటు శశి కుమార్ ను టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ పోలీసులు సహాయంతో ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాబులు, సూరజ్ పరారైనట్లు డిసిపి పేర్కొన్నారు. 24 గంటల్లోపే నిందితులను పట్టుకున్న పోలీసులందరినీ డీసీపీ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News