Saturday, April 20, 2024

‘శాకుంతలం’ ట్రైలర్ వచ్చేస్తోంది..

- Advertisement -
- Advertisement -

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మైథలాజికల్ మూవీ శాకుంతలం. ఈ సినిమాలో సమంత శకుంతల పాత్ర చేస్తుండగా దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీని దిల్ రాజు సమర్పిస్తుండగా గుణా టీమ్ వర్క్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు.

ఇక ఈ ప్రతిష్టాత్మక భారీ పాన్ ఇండియన్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని ఈనెల 9న మధ్యాహ్నం 12 గం.6 ని. లకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది సినిమా యూనిట్. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్‌లోని పివిఆర్ ఆర్.కె. సినీప్లెక్స్‌లో 9న ఉదయం నిర్వహించనున్నారు. ఇక ‘శాకుంతలం’ మూవీ ఫిబ్రవరి 17న గ్రాండ్‌గా పలు భాషల్లో రిలీజ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News