Sunday, April 28, 2024

పాక్ 24 వ ప్రధానిగా షెహబాజ్ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ 24వ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షనివాసభవనం అయివాన్ ఐ సదర్‌లో అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఈ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్, పిఎంఎల్‌ఎన్ కార్యకర్తలు, పిపిపి నేత, సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షెహబాజ్ పార్లమెంట్ రద్దయి ఎన్నికలు జరిగే ముందు వరకు 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టువరకు సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు.

2022 నుంచి తీవ్ర ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతూ భద్రతాపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రెండోసారి షెహబాజ్ ప్రధానిగా పగ్గాలు చేపట్టడం గమనార్హం. పిఎంఎల్‌ఎన్‌కు పిపిపికి అత్యంత విశ్వసనీయమైన అభ్యర్థి షెహబాజ్ 336 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో 201 ఓట్లను సాధించుకోగలిగారు. ఆయన ప్రధాన ప్రత్యర్థి జైలుపాలైన మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు చెందిన పిటిఐ అభ్యర్థి ఒమర్ ఆయూబ్‌ఖాన్ కు కేవలం 92 ఓట్లే వచ్చాయి. దీంతో అతిసునాయాసంగా షెహబాజ్ మెజార్టీ సాధించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News