Sunday, September 15, 2024

రూ.20 వేల అప్పు చెల్లించలేదని అన్నయ్యను కట్టేసిన తమ్ముడు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: అప్పు తీసుకున్న దాంట్లో కొంత భాగం చెల్లించలేదని అన్నావదినలను తమ్ముడు తాడుతో కట్టేసిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…..  నాసర్‌పురా వీధిలో పరుశరాములు, తార అనే దంపతులు నివసిస్తున్నారు. పరుశురాములు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నారు. తమ్ముడి కనకయ్య వద్ద అన్న సంవత్సరం క్రితం రూ.1.20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు తిరగి ఇచ్చేయాలని పలుమార్లు అన్నతో తమ్ముడు గొడవపడడంతో నాలుగు నెలల క్రితం లక్ష రూపాయలు తిరిగి ఇచ్చేశాడు. ఇంకా వడ్డీ, అసలులో రూ.20 వేలు తమ్ముడికి ఇవ్వాల్సి ఉంది. రూ.20 వేల కోసం తమ్ముడితో అన్న గొడవకు దిగాడు. ఇద్దరు కలిసి కౌన్సిలర్ దగ్గర పంచాయతీ పెట్టారు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో పరుశురాములు అక్కడి నుంచి వెళ్తుండగా తమ్ముడు, ఆయన భాగ్య, కుమారుడు భాను లాక్కొచ్చి ఆలయంలో స్తంభానికి అతడిని కట్టేశారు. తన భర్తను కట్టేస్తుండగా తార అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఆమెను కూడా స్తంభానికి కట్టేశారు. స్థానికులు బాధితులను విడిపించి కనకయ్య కుటుంబీకులను మందిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News