Saturday, December 7, 2024

బస్సులో సీటు ఇవ్వలేదని… యువతిని తిట్టిన జగిత్యాల ఎస్‌ఐ (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ఆర్‌టిసి బస్సులో సీటు ఇవ్వలేదని ఓ యువతిని ఎస్‌ఐ తన భార్యతో కలిసి అసభ్యపదజాలంతో దూషించిన సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట నుంచి జగిత్యాలకు వెళ్తున్న టిఎస్‌ఆర్‌టిసి బస్సులో షేక్ ఫాతిమా అనే యువతి ప్రయాణిస్తుంది.  జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ అనిల్ కుమార్ భార్య కూడా అదే బస్సులో ప్రయాణిస్తుంది.

తనకు సీటు ఇవ్వమని షేక్ ఫాతిమాను ఎస్‌ఐ భార్య డిమాండ్ చేసింది. ఆమె సీటు ఇవ్వకపోవడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. వెంటనే ఆమె తన భర్త ఎస్‌ఐకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. ఎస్‌ఐ అక్కడికి చేరుకొని ముస్లిం యువతిని తన భార్యతో కలిసి అసభ్యపదజాలంతో దూషించాడు. తనతో ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తించాడని సదరు యువతి ఆరోపణలు చేసింది. జగిత్యాలలలో బస్సులో దిగగానే షేక్ ఫాతిమా జగిత్యాల స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ట్విట్టర్‌లో 70 వేల మంది వీక్షించగా 1500 మంది లైక్ చేశారు.

Also Read: దేశంలోనే తెలంగాణ పోలీస్ బెస్ట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News