Friday, March 29, 2024

కుప్ప కూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్

- Advertisement -
- Advertisement -
దాదాపు 175 బిలియన్ డాలర్ల వినియోగదారుల డిపాజిట్లు ఇప్పుడు ‘ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్’ నియంత్రణలో!

న్యూఢిల్లీ: పెద్దపెద్ద టెక్నాలజీ స్టార్టప్‌లకు డబ్బునందించే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ శుక్రవారం కుప్పకూలింది. మదుపరులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆ బ్యాంకు షేర్లు ఘోరంగా పతనం కావడంతో గ్లోబల్ మార్కెట్‌లు కూడా భారీగానే పతనమయ్యాయి.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలడానికి కారణాలివి:

1. 2008లో ఏర్పడిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ విఫలం చెందుతూ వస్తోంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలినట్లు శుక్రవారం కాలిఫోర్నియా బ్యాంకింగ్ రెగ్యులేటర్లు తెలిపారు.
2. అమెరికా రెగ్యులేటర్లు సిలికాన్ వ్యాలీ బ్యాంకును మూసేశారు.
3. షేర్ ధర ఘోరంగా పతనం కావడం, అందులో డిపాజిట్ చేసిన వినియోగదారులు బెంబేలెత్తడం దరిమిలా రెండు రోజుల్లోనే నాటకీయ పరిణామం చోటుచేసుకుంది.
4. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ చాలా వరకు తన పెట్టుబడిని యుఎస్ బాండ్లలో పెట్టింది. ద్రవ్యోల్బణ రేట్లను తగ్గించేందుకుగాను ఫెడరల్ రిజర్వ్ గత ఏడాది వడ్డీ రేట్లను పెంచడం మొదలెట్టింది. దాంతో బాండ్ల విలువ కూడా తగ్గిపోయింది.
5. కొవిడ్ సంక్షోభం తర్వాత నిధులు కూడా కరిగిపోయాయి. దాంతో పెద్ద సంఖ్యలో క్లయింట్లు తమ డబ్బును విత్‌డ్రా చేసుకున్నారు. వారి డిమాండ్‌ను నెరవేర్చడానికి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తన పెట్టుబడులను కూడా అమ్మాల్సి వచ్చింది. దాంతో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ షేర్ల ధరలు పడిపోయాయి.
6. గత వారం తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 2 బిలియన్ డాలర్లను ఆ బ్యాంకు నష్టపోయింది.
7. ఆ బ్యాంకు మూతపడ్డాక దాదాపు 175 బిలియన్ డాలర్ల కస్టమర్ డిపాజిట్లు ఇప్పుడు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డిఐసి) నియంత్రణలో ఉన్నాయి.
8. ఎఫ్‌డిఐసి ఓ కొత్త బ్యాంకును సృష్టించింది. దాని పేరు ది నేషనల్ బ్యాంక్ ఆఫ్ శాంట క్లారా. అందులోనే సిలికాన్ వ్యాలీ బ్యాంకు ఆస్తులు ఉండనున్నాయి.
9. బీమా చేసిన డిపాజిట్లు పొందే అవకాశం ఉన్నందున అన్ని బ్రాంచీలను సోమవారం ఉదయం తెరిచి ఉంచనున్నట్లు ఎఫ్‌డిఐసి డిపాజిటర్లకు తెలిపింది. పాత బ్యాంకు చెక్‌లను కూడా స్వీకరించనున్నట్లు ఆ ఆర్థిక సంస్థ(ఎఫ్‌డిఐసి) తెలిపింది.
10. వాషింగ్టన్‌లో రాజకీయవేత్తలు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలిన నేపథ్యంలో రెండుగా చీలిపోయారు. ఒక వర్గం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులలో పూర్తి విశ్వాసాన్ని కనబరుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News