Tuesday, March 19, 2024

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్… బండి సంజయ్‌కు సిట్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. మార్చి 24వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని తెలిపింది. టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రాల లీక్ అంశం మీద ఆయన కామెంట్స్ చేశారు. ఒకే ఊరిలో ఎక్కువ మందికి ర్యాంకులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల మీద ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ ఘటనలో తమకు నోటీసులు ఇచ్చే ధైర్యం ఉందా అని సిట్ అధికారులపై బండి సంజయ్ కామెంట్స్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ ఆరోపణలకు 24వ తేదీన తమ ఎదుట హాజరై ఆధారాలు ఇవ్వాలని సిట్ నోటీసులు జారీ చేసింది.

సంజయ్ చేసిన కామెంట్స్ ఇవే
గ్రూప్ 1 పేపర్ లీకేజీలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయని తెలిపారు. బిఆర్‌ఎస్ జెడ్‌పిటిసి, సర్పంచ్, సింగిల్ విండో ఛైర్మన్ పిల్లలు, బంధువులు గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫై అయ్యారని పేర్కొన్నారు. ఒకే మండలం నుంచి యాభై మందికిపైగా క్వాలిఫై అయ్యారని ఆరోపణలు చేశారు. ఓ చిన్న గ్రామంలో ఆరుగురు క్వాలిఫై అయ్యారని వెల్లడించారు. ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ ఎలా చేయగలదని అడిగారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ‘నిరుద్యోగ యువత నోటిలో మట్టి కొట్టారని విమర్శించారు. నియామకాల్లో అక్రమాలకు పాల్పడి 30 లక్షల మంది యువత జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు.

’గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగు చూస్తుంటే టిఎస్‌పిఎస్‌సి స్కామ్ అనుకున్న దానికన్నా చాలా పెద్దదని అర్థమవుతోంది. బిఆర్‌ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారివద్ద పని చేసే వాళ్లను గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో క్వాలిఫై చేసినట్టు తెలుస్తోంది. జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా మెయిన్స్ కు అర్హత సాధించారు.’ అని బండి కామెంట్స్ చేశారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆరోపణలు చేసిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 23వ తేదీన ఆధారాలు తీసుకుని రావాలని చెప్పింది. లీకేజీ వ్యవహారంపై కామెంట్స్ చేసిన మరికొంతమంది కూడా సిట్ నోటీసులు అందుకునే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News