Thursday, May 2, 2024

బెలోచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆరుగురు కార్మికులను కాల్చి చంపిన వేర్పాటు వాదులు

- Advertisement -
- Advertisement -

కరాచి : పాకిస్థాన్ లోని కల్లోలిత ప్రాంతం బెలోచిస్థాన్ ప్రావిన్స్‌లో శనివారం ఓ ఇంటిపై సాయుధులైన వేర్పాటు వాదులు దాడి చేసి ఆరుగురు కార్మికుల్ని కాల్చి చంపారు. ఈ దాడిలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్వెట్టాకు దక్షిణంగా 606 కిలోమీటర్ల దూరంలో టర్బట్ సిటీ శివారు ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. కార్మికులు నివసిస్తున్న ఇంటి లోకి సాయుధులైన వేర్పాటు వాదులు చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని , మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని,

వారిని సమీప ఆస్పత్రిలో చేర్పించినట్టు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. మరణించిన కార్మికులు ఇతర ప్రాంతం నుంచి బెలోచిస్థాన్ వచ్చి ప్రైవేట్ నిర్మాణ సంస్థ ప్రాజెక్టులో పనిచేసున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. బెలోచిస్థాన్ లోని వివిధ ప్రాజెక్టుల్లో పనిచేయడానికి వేరే ప్రాంతాల నుంచి కార్మికులు రావడం, వారిని లక్షంగా చేసుకుని వేర్పాటు వాదులు దాడికి పాల్పడడం ఇది మొదటిసారేమీ కాదు. ఇప్పుడు జరిగిన దాడికి బాధ్యులం తామేనని ఏ గ్రూపు ఇంతవరకు ప్రకటించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News