Monday, May 20, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఆరుగురు నక్సల్స్ లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మ జిల్లాలో ఆరుగురు నక్సలైట్లు గురువారం లొంగిపోయినట్లు అధికారి ఒకరు తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లపై మొత్తంగా కలిపి రూ. 36 లక్షల రివార్డు ఉన్నట్లు ఆయన తెలిపారు. వీరిని దుధి పొజ్జా, అతని భార్య దుధి పొజ్జె, అయతే కొర్సా అలియాస్ జయక్క, కవసి ముడా, కారం నరన్న అలియాస్ భూమా, మడ్కం సుక్కా అలియాస్ రైనూగా జిల్లా ఎస్‌పి కిరణ్ చవాన్ గుర్తించారు. పొజ్జాపై రూ. 8 లక్షల రివార్డు ఉంది.

అతను మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా(పిఎల్‌జిఎ) బెటాలియన్ నంబర్ 1 సభ్యుడేగాక పీపుల్స్ పార్టీ కమిటీ సభ్యుడు కూడా. పిఎల్‌జిఎ బెటాలియన్ నంబర్ 1 సభ్యురాలైన అతని భార్య పొజ్జెపై కూడా రూ. 8 లక్షల రివార్డు ఉంది. నక్సలైట్ల కోసం జిల్లా పోలీసులు చేపట్టిన పునరావాస చర్యలు నచ్చి పోలీసుల ఎదుట ఈ ఆరుగురు నక్సలైట్లు లొంగిపోయారని ఎస్‌పి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానం కింద లొంగిపోయిన నక్సలైట్లకు సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News