Saturday, April 20, 2024

ప్రభుత్వ ఖాతాల్లో 6 వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

money

 ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.3110 కోట్లు
అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్లు
వివిధ ప్రభుత్వ శాఖల డిపాజిట్లపై ఆర్థిక శాఖకు వివరాలు సమర్పించిన బ్యాంకులు
ఎఫ్.డిల కాలపరిమితిపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకు ఖాతాల్లో రూ.6 వేల 49 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు బ్యాంకులు ఆర్థిక శాఖకు వెల్లడించాయి. ఏయే శాఖలో ఎంత మొత్తం ఉన్నాయో కూడా వివరాలను సమర్పించాయి. ఆర్థిక మాంద్యం రాష్ట్ర రాబడిపై ప్రభావం చూపడంతో ప్రభుత్వం ఆదాయ మార్గాలపై అన్వేషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్ము ఎంత వివరాలు తెలియజేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. అయితే అరకొర సమాచారం రావడంతో నేరుగా బ్యాంకులను సంప్రదించింది.

ఏయే శాఖ ఎంత మొత్తంలో సేవింగ్స్, కరెంట్ అకౌంట్ ఖాతాల్లో ఎంత సొమ్ము జమ చేసిందో వివరాలు ఇవ్వాలని కోరింది. ఎప్పటి నుంచి ఆ నిధులు ఉంటున్నాయో కూడా వివరాలు తెలపాలంది. దీనిపై కసరత్తు చేసిన ఎస్‌ఎల్‌బిసి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.6049 కోట్లు ఉన్నట్లు తేల్చారు. ఇది గత డిసెంబర్ వరకు ఉన్న లెక్క. ఇందులో సేవింగ్స్ ఖాతాలో జమ చేసిన మొత్తం రూ.2638 కోట్లు ఉన్నాయి. కరెంట్ అకౌంట్‌లలో రూ.301.25 కోట్లు ఉన్నట్లు బ్యాంకులు ఆర్థిక శాఖకు సమర్పించాయి.

ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.3110 కోట్లు ఉన్నట్లు తెలిపాయి. ఈ వివరాలను తీసుకున్న ఆర్థిక శాఖ ఏ ప్రభుత్వ శాఖ ఎంత మొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసింది. ఎప్పుడు చేసింది. ఆ నిధులు ఎప్పటి నుంచి అలా ఉండిపోయాయనే వివరాలపై ఆరా తీసింది. ఈ క్రమంలో ప్రభుత్వ విభాగాల్లోని ఉన్నతాధికారులు కొందరు బ్యాంకులతో కుమ్మక్కై ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసినట్లు గుర్తించారు. ఇందుకోసం కమిషన్లు కూడా తీసుకుంటున్నారని తెలిసింది. లబ్ధిదారులకు వెళ్లాల్సిన సొమ్మును కావాలని వారం, పది రోజులు బ్యాంకుల్లో నిలువ చేసి వడ్డీలకు కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వ విభాగాల ఖాతాల్లో నిరుపయోగంగా ఉన్న నిధులను వెంటనే ఆర్థిక శాఖకు మళ్లించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఏకంగా రూ.3110 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉండటమేంటి అని ఆర్థిక శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో అధికం

ప్రభుత్వ శాఖల్లోని బ్యాంకు ఖాతాల్లో బ్యాంకు ఆఫ్ బరోడాలో అధికంగా రూ.2058 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.1881 కోట్లు కావడం గమనార్హం. ఆ తరువాత ఆంధ్రాబ్యాంకులో రూ.1755 కోట్లు, కెనరా బ్యాంకులో రూ.1299 కోట్లలో రూ.895 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇక ఎస్‌బిఐలో రూ.534 కోట్లు, ఒరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో రూ.126.55 కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.118.74 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.87.41 కోట్లు, టెస్కాబ్‌లో రూ.65.75 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రూ.3.28 కోట్లు డిపాజిట్లు ఉన్నట్లు బ్యాంకులు ఆర్థిక శాఖ తెలిపాయి.

Six thousand crore in government accounts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News