Tuesday, May 7, 2024

ఏలూరులో కార్యకలాపాలను విస్తరించిన ఎస్ఎంఎఫ్ జి గృహశక్తి

- Advertisement -
- Advertisement -

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అందుబాటు ధరల (సరసమైన) గృహ ఋణ (హౌసింగ్ ఫైనాన్స్) కంపెనీలలో ఒకటైన SMFG గృహశక్తి, ఏలూరులో తమ మొదటి శాఖతో ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించింది. ఇది రాష్ట్రంలో సంస్థకు 9వ శాఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఈ విస్తరణ, రాష్ట్ర మంతటా వీలైనంత ఎక్కువ మందికి సరసమైన ధరల్లో గృహాలను అందుబాటులోకి తీసుకురావాలనే సంస్థ యొక్క దృఢమైన లక్ష్యం ను ప్రదర్శిస్తుంది.

గతంలో ఫులర్టన్ ఇండియా హోమ్ ఫైనాన్స్ కంపెనీగా గుర్తింపు పొందిన SMFG గృహశక్తి, తమ విస్తృతమైన అనుభవం, బలమైన పేరెంటేజ్, దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్, బలమైన రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ తో గృహ, గృహాభివృద్ది, గృహ నిర్మాణం, గృహ విస్తరణ తో పాటుగా తనఖా రుణాలు, మధ్య స్థాయి డెవలపర్‌లకు కొత్త లేదా పునఃవిక్రయం వాణిజ్య ఆస్తి, వాణిజ్య ప్లాట్లు, నిర్మాణ ఫైనాన్స్ కోసం రుణాలు సహా విస్తృతమైన రుణాల పోర్ట్‌ఫోలియోను కలిగి వుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ విస్తరణ గురించి SMFG గృహశక్తి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీపక్ పాట్కర్ మాట్లాడుతూ… “భారతదేశంలో సరసమైన గృహాల విభాగం ఆకట్టుకునే వేగంతో అభివృద్ధి చెందుతోంది. మేము వెనుకబడిన, ఔత్సాహిక అల్పాదాయ, మధ్యతరగతి వర్గాల ప్రజల అవసరాలను తీర్చడానికి కట్టుబడి ఉన్నాము. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి 2016లో ప్రవేశించాము. అప్పటి నుండి, మేము మా కస్టమర్ల స్వంత ఇంటి కలను నెరవేర్చే లక్ష్యంతో వారి అవసరాలను తీరుస్తున్నాము. మా విస్తృతమైన నెట్‌వర్క్, ఛానెల్ భాగస్వాములు, నిర్దిష్ట హోమ్ లోన్ ప్రోడక్ట్ ఆఫర్‌ల ద్వారా, జీవితాలను శక్తివంతం చేయడం, ఆకాంక్షలను తీర్చటం అనే మా దృక్పథానికి కట్టుబడి ఉంటూ ఈ ప్రాంతంలోని మారుమూల ప్రాంతాలకు సైతం మేము చొచ్చుకుపోతున్నాము” అని అన్నారు.

భారత దేశ వ్యాప్తంగా , SMFG గృహశక్తి టైర్ 2+ ప్రాంతాలలో తమ కార్యకలాపాలను విస్తరించడం, బలమైన అంతర్గత బృందాన్ని నిర్మించడం, తమ కార్యకలాపాలను మరింత డిజిటలైజేషన్ చేయడంపై దృష్టి సారించడం ద్వారా తమ వృద్ధి పథాన్ని కొనసాగించాలని యోచిస్తోంది. SMFG గృహశక్తి ఆర్ధిక సంవత్సరం 2023లో గణనీయంగా వృద్ధి చెందింది, AUM పరంగా ఇయర్ ఆన్ ఇయర్ 44.2% వృద్ధిని నమోదు చేసి రూ. 6,427 కోట్లకు చేరింది. ఆర్ధిక సంవత్సరం 2022లో ఇది రూ. 4,456 కోట్లుగా ఉంది. సంస్థ మొత్తం ఋణ వితరణ సైతం 137% వృద్ధి చెంది ఆర్ధిక సంవత్సరం 2023లో రూ. 3,055 కోట్లగా నిలిచాయి. ఆర్ధిక సంవత్సరం 2022లో ఈ మొత్తం రూ. 1,287 కోట్లుగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News