Tuesday, October 15, 2024

వాంగ్‌చుక్ మళ్లీ అరెస్టు

- Advertisement -
- Advertisement -

పోలీసు స్టేషన్‌లో కొనసాగుతున్న ఆమరణ దీక్ష

న్యూఢిల్లీ: వాతావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌తోపాటు మరో 150 మంది ఆయన అనుచరులను మంగళవారం రాత్రి విడుదల చేసిన పోలీసులు కొద్ది గంటల్లోనే మరోసారి అరెస్టు చేశారు. తమ అరెస్టును నిరసిస్తూ వాంగ్‌చుక్, ఆయన అనుచరులు ఆయా పోలీసు స్టేషన్లలో తమ ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. వాంగ్‌చుక్‌ను మంగళవారం రాత్రి విడుదల చేసినప్పటికీ ఆయన, ఆయనతోపాటు అరెస్టయిన లడాఖ్ పాదయాత్రికులు సెంట్రల్ ఢిల్లీలోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో వారిని మళ్లీ అదుపులోకి తీసుకోవలసి వచ్చిందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

వాంగ్‌చుక్‌తోపాటు కొందరిని బావన పోలీసు స్టేషన్‌లో ఉంచగా మిగిలిన వారిని నరేలా పారిశ్రామిక వాడ, అలీపుర్, కనిహావాలా పోలీసు స్టేషన్లలో ఉంచినట్లు ఆయన తెలిపారు. తమ డిమాండ్లపై ఒత్తిడి తెచ్చేందుకు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి దేశ రాజధానిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వాంగ్‌చుక్, ఆయన మద్దతుదారులు 150 మందిని సింఘూ సరిహద్దు వద్ద సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.

లేహ్‌లో నెలరోజుల క్రితం వాంగ్‌చుక్ ప్రారంభించిన చలో ఢిల్లీ పాదయాత్ర సోమవారం రాత్రి సింఘూ సరిహద్దు వద్దకు చేరుకుంది. లేహ్ అపెకస్ బాడీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరుగుతోంది. లడఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలని, లడఖ్‌ను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండు చేస్తూ వీరు పాదయాత్ర చేపట్టారు. కార్గిల్ డెమోక్రటిక్ ఫోరమ్ సారథ్యంలో ఈ ఆందోళన కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News