Thursday, October 10, 2024

ఢిల్లీలో 26 ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ ఫోన్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

ఒక ప్రయాణికురాలి వద్ద కస్టమ్స్ పట్టివేత

న్యూఢిల్లీ : ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఒక ప్రయాణికురాలి వ్యానిటీ బ్యాగ్ లోపల దాచిన 26 కొత్త ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 30 ద్వితీయార్ధంలో ఉన్న మహిళ మంగళవారం హాంకాంగ్ నుంచి వచ్చిన తరువాత ఆమెను తమ అధికారులు అడ్డగించినట్లు కస్టమ్స్ శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘ప్రయాణికురాలిని వ్యక్తిగతంగాను, బ్యాగేజినీ సమగ్రంగా తనిఖీ చేయగా ఆమె వ్యానిటీ బ్యాగ్‌లో టిష్యూ పేపర్ల మధ్య దాచిన 26 ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు’ అని కస్టమ్స్ శాఖ తెలిపింది.

ఆ మహిళను అరెస్టు చేయలేదు కానీ ఆధునిక ఎలక్ట్రానిక్ వస్తువుల స్మగ్లింగ్ సిండికేట్‌లో భాగమా లేక విడిగా జరిగిందా అన్నది దర్యాప్తు చేస్తున్నారు. ‘ఆ ఐఫోన్లను కస్టమ్స్ చట్టం 1962 సెక్షన్ 110 కింద స్వాధీనం చేసుకోవడమైంది. మరింతగా దర్యాప్తు సాగుతోంది’ అని కస్టమ్స్ శాఖ తన ప్రకటనలో తెలియజేసింది. స్వాధీనం చేసుకున్న ఆ ఐఫోన్ల మొత్తం విలువ సుమారు రూ. 3066328 అని కస్టమ్స్ శాఖ పేర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News