Friday, April 19, 2024

సౌతాఫ్రికా 73/6

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 73 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మలాన్ 15 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో అవేష్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్వింటన్ డికాక్ ఆరు పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అవేష్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రీజా హెండ్రిక్స్ మూడు పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మక్రమ్ తొమ్మిది పరుగులు చేసి షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో శామ్సన్ క్యాచ్ ఇచ్చి నాల్గో వికెట్ రూపంలో ఔటయ్యాడు. డెవిడ్ మిల్లర్ ఏడు పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. అండిల్ పెహ్లక్యో ఐదు పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో హెన్రీచ్ క్లాసెన్ (22), మార్కో జన్సన్(1)  బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News