Tuesday, June 18, 2024

కేరళను తాకిన రుతుపవనాలు

- Advertisement -
- Advertisement -

Monsoon

హైదరాబాద్ : కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవులు మొత్తం ప్రాంతాలు, మాల్దీవులలోని మిగిలిన ప్రాంతాలు, కేరళ, మహేలోని చాలా ప్రాంతాలు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాల్లోకి ఈ రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాల నేపథ్యంలో జూన్ 2020 నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా చాలావరకు సాధారణ వర్షపాతం( 96శాతం నుంచి 104శాతం) నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆరేబియా సముద్రంలో నిసర్గ తుఫాన్ ఏర్పడడంతో నైరుతి రుతుపవనాలు తొందరగా వచ్చాయని ఐఎండి అంచనా వేస్తోంది. ఈ ఏడాది నూరుశాతం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.

పరిమాణాత్మకంగా రుతుపవనాల సమయంలో వర్షపాతం భారతదేశం మొత్తం 102శాతం. (మోడల్ లోపం+4శాతం)మని భారతదేశం మొత్తం వర్షపాతం జులై నెలలో103 శాతం కాగా ఆగస్టు నెలలో 97శాతం కాగా నైరుతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలకు సంబంధించి జూన్ 2020 నుంచి సెప్టెంబర్ 2020 సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం 102 శాతం కాగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నేడు, రేపు వర్షాలు

తూర్పు మధ్య దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణించి సోమవారం ఉదయం 08.30 గంటలకు Lat.13.2 deg N, Long. 71.4 deg.E వద్ద పాంజిమ్(గోవా) కు నైరుతి దిశగా 360 కి.మీలు, ముంబై (మహారాష్ట్ర) కు దక్షిణ నైరుతి దిశగా 670 కి.మీ, సూరత్(గుజరాత్) కు దక్షిణ నైరుతి దిశగా 900 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాగల 12 గంటల్లో మరింత బలపడి తూర్పు మధ్య ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తదుపరి 24 గంటల్లో బలపడి తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని, ప్రారంభంలో జూన్ 2 వ తేదీ ఉదయం వరకు ఉత్తర దిశగా ప్రయాణించి తరువాత ఉత్తరఈశాన్య దిశగా జూన్ 3 వ తేదీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో హరిహరేశ్వర్ (రైగర్, మహారాష్ట్ర) దామన్ మధ్య ఉత్తర మహారాష్ట్ర మరియు దక్షిణ గుజరాత్ తీరాలను దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి, మంగళవారంక అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుంచి 40 kmph) వేగంతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, వనపర్తి మరియు జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Southwest Monsoon Hits Kerala 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News