Sunday, April 28, 2024

దేశంలోనే అటవీ విస్తీర్ణంలో హైదరాబాద్ మొదటి స్థానం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: హరితహారం కోసం గ్రామాలు, మున్సిపాలిటీలకు గ్రీన్ బడ్జెట్ కింద నిధులు కేటాయిస్తూ.. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రోత్సాహిస్తున్నామని కెటిఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచ పర్యావరణవేత్త ఏరిక్ సోలీహిమ్ హైదరాబాద్ వాసులకు అభినందనలు చెబుతూ ట్వీట్ చేశారు. మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధిలో హైదరాబాద్ దేశంలోనే మొదటిస్థానంలో నిలవడం గొప్ప విషయమని ఏరిక్ సోలీహిమ్ అభినందించారు. దశాబ్ద కాలంలో4,866 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. వెల్ డన్ తెలంగాణ అని ఏరిక్ సోలీహిమ్ ప్రశంసలు కురిపించారు. ఈ ట్వీట్ పై రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. హరితహారం క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి కెసిఆర్ అని కెటిఆర్ స్పష్టం చేశారు. హరితహారం కోసం గ్రామాలు, మున్సిపాలిటీలకు గ్రీన్ బడ్జెట్ కింద నిధులు కేటాయిస్తూ.. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రోత్సాహిస్తున్నామని కెటిఆర్ ట్వీట్ చేశారు. మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21.47శాతం అడవులు ఉన్నాయి. మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధిలో హైదరాబాద్ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. దశాబ్దకాలంలో నగరంలో 4,866 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. దేశంలో గత రెండేండ్లలో అటవీ విస్తీర్ణం 2,261 చదరపు కిలోమీటర్లు పెరుగగా, తెలంగాణలోనే 632 చదరపు కిలోమీటర్ల పెరుగుదల నమోదు కావడం విశేషం. దేశంలో విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్లో, శాతం పరంగా మిజోరంలో అడవులు అధికంగా ఉన్నాయని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా- 2021 రిపోర్టులో తెలిపింది.
ఆరేండ్లలో అడవి విస్తీర్ణం పెరుగుదల
రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. అందులో 2021 నాటికి అడవులు 26,969 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఇది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 21.47శాతం. 2015-21 మధ్య రాష్ట్రంలో నోటిఫైడ్ అడవులతోపాటు బయటి ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం 1,360 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇది 6.85 శాతం పెరుగుదల. ఇందులో ట్రీ కవర్(చెట్ల పచ్చదనం) 361 చదరపు కిలోమీటర్లు(14.51 శాతం), ఫారెస్ట్రీ, గ్రీన్ కవర్ 1,721 చదరపు కిలోమీటర్లు. రాష్ట్రంలో 2014లో 19,854 చ.కి.మీ విస్తీర్ణంలో 19,85,400 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉంది. 2015లో
రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. అందులో 2021 నాటికి అడవులు 26,969 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఇది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 21.47శాతం. 2015-21 మధ్య రాష్ట్రంలో నోటిఫైడ్ అడవులతోపాటు బయటి ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం 1,360 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇది 6.85 శాతం పెరుగుదల. ఇందులో ట్రీ కవర్ (చెట్ల పచ్చదనం) 361 చదరపు కిలోమీటర్లు (14.51 శాతం), ఫారెస్ట్రీ, గ్రీన్ కవర్ 1,721 చదరపు కిలోమీటర్లు. రాష్ట్రంలో 2014లో 19,854 చ.కి.మీ విస్తీర్ణంలో 19,85,400 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉంది. 2015లో తెలంగాణకు హరితహారం ప్రారంభమైన తర్వాత 2015-17 మధ్య కాలంలో 565 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 16,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది.2017-19 మధ్యలో మరో 163 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు పెరిగాయి. 2019- 21 మధ్య 632 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 63,200 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. 2014-2019 మధ్య అటవీ పచ్చదనం 6.85 శాతం పెరిగింది. చెట్ల పచ్చదనం (ట్రీ కవర్ -2014లో 2,487 చదరపు కిలోమీటర్లు (2,48,700 హెక్టార్లు ఉండగా హరితహారం మొదలైన తర్వాత 2014-19 మధ్య 361 చదరపు కిలోమీటర్లు(36,100 హెక్టార్లు) పెరిగింది. ఇది 14.51 శాతం పెరుగుదల.

Special Green Budget in all municipalities: KTR Tweet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News