Tuesday, July 16, 2024

ప్రపంచ కప్ 2023: 171 పరుగులకే శ్రీలంక ఆలౌట్

- Advertisement -
- Advertisement -

వరల్డ్ కప్ లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచులో శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కుశాల్ పెరీరా (51), మినహా టాపార్డర్ బ్యాటర్లంతా ఫెయిల్ అయ్యారు. ఒక దశలో 128 పరుగులకే 9 వికెట్లు కోల్పోగా, తీక్షణ (39), మధుశంక (19) నిలకడగా రాణించడంతో ఈ మాత్రం స్కోర్ సాధించింది శ్రీలంక. ఈ మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ , పెర్గూసన్ 2, శాంట్నర్ 2, రచిన రవీంద్ర 2 వికెట్లు తీశారు. శ్రీలంకతో గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే 172 పరుగులు చేయాల్సి ఉంది. ప్రపంచ కప్‌లో కివీస్ సెమీ-ఫైనల్ స్థానాన్ని సంపాదించాలని చూస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News