Saturday, October 5, 2024

అదానీ పవర్ ప్రాజెక్టును రద్దు చేస్తాం

- Advertisement -
- Advertisement -

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలిచిన పక్షంలో అదానీ గ్రూపునకు చెందిన పవన విద్యుత్ ప్రాజెక్టును రద్దు చేస్తామని మార్కిస్టు జనతా విముక్తి పెరమున(జెవిపి) వాగ్దానం చేసింది. నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్‌పిపి) పేరటి ఏర్పడిన ఫ్రంట్ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న జెవిపి నాయకుడు అనుర కుమార దిసనాయకె సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే అదానీ పవర్ ప్రాజెక్టును రద్దు చేస్తానని ప్రకటించారు.

ఈ పవర్ ప్రాజెక్టు వల్ల శ్రీలంక ఇంధన రంగ సార్వభౌమత్వానికి ముప్పు ఏర్పడుతుందా అన్న ప్రశ్నకు తమ దేశ ఇంధన సార్వభౌమత్వానికి ముప్పుగా ఉన్న పక్షంలో ఆ ప్రాజెక్టును తాము కచ్ఛితంగా రద్దు చేస్తామని ఆయన చెప్పారు. శ్రీలంక అంతర్యుద్ధ కాలంలో భారత్ లంక శాంతి-ఒప్పందం ద్వారా భారత్ ప్రత్యక్ష జోక్యాన్ని వ్యతిరేకిస్తూ 1987 నుంచి 1990 వరకు జెవిపి హింసాత్మక పోరాటాన్ని సాగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News