Thursday, March 28, 2024

నవంబర్‌లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.127.3 కోట్లు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ, హైదారాబాద్ : తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నవంబర్ నెలలో రూ.127.3 కోట్లుగా నమోదైనట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. దీంతో ఈ వార్షిక సంవత్సరంలో హుండీ ఆదాయం రూ. 1600 కోట్లు దాటుతుందని అంచనా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి నెలా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 100 కోట్ల మార్కును దాటుతుంది. తాజాగా నవంబర్ నెలలో కూడా రూ. 127.3 కోట్లతో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం నమోదైంది. ఈ వార్షిక సంవత్సరంలో కేవలం ఎనిమిది నెలల కాలంలోనే హుండీ ఆదాయం రూ.1161.74 కోట్లు వచ్చింది.

గత తొమ్మిది నెలల కాలంలో అత్యధికంగా జూలై నెలలో రూ.139.35 కోట్ల హుండీ ఆదాయం నమోదైంది. ప్రతిరోజు శ్రీవారిని దర్శించే భక్తుల సంఖ్య 70 వేలకు పైగా ఉంటుందని, ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2019—~20 వార్షిక సంవత్సరంలో లభించిన రూ.1,313 కోట్లే అత్యధిక హుండీ ఆదాయంగా ఉంది. ఇదే ఏడాది జూలై 4న శ్రీవారికి ఒక్కరోజులో అత్యధికంగా రూ.6.14 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. కరోనా తర్వాత తిరుమలకు వచ్చే భక్తుల రాక పెరిగిందని, దీంతో గత రెండేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న మొక్కులను ఒకేసారి తీర్చుకుంటున్నారని, అందుకే నెలవారీ ఆదాయం వంద కోట్ల పైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News