Saturday, April 27, 2024

బూస్టర్ డోస్ రిస్కును తగ్గిస్తుంది

- Advertisement -
- Advertisement -
Stephen Raveendra launches booster dose drive
సైబరాబాద్‌లో వ్యాక్సిన్ సెంటర్‌ను ప్రారంభించిన
సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్: బూస్టర్ డోస్ తీసుకోవడం వల్ల ఆస్పత్రిలో చేరే అవసరం ఏర్పడదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని సిపి స్టిఫెన్ రవీంద్ర బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్ స్టేషన్లలో 1,500 డోసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు రిస్కు తగ్గించేందుకు బూస్టర్ డోస్ ఇస్తున్నామని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులు అందరూ బూస్టర్ డోస్ వేసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ నుంచి పోలీసులను రక్షించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రొటో కాల్‌ను పాటించాలని అన్నారు. శానిటైజర్, మాస్కు, సామాజిక దూరం పాటించాలని కోరారు. ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News