Wednesday, April 30, 2025

అవహేళనలు ఆపి… మహిళా బిల్లు ఆమోదానికి కృషి చేయండి: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

కాలం చెల్లిన మూస పద్ధతిలో మహిళలను అవమానించడం తగదు
ట్విట్టర్‌లో బిజెపికి కల్వకుంట్ల కవిత హితవు

మన తెలంగాణ/హైదరాబాద్: కాలంచెల్లిన మూస పద్ధతిలో మహిళలను అవహేళన చేయడం తగదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలపై దాడి చేయడం ఆపాలని ట్విట్టర్ వేదికంగా కవిత బిజెపికి సూచించారు. మహిళలు ఉన్నత స్థానానికి చేరుకోవడం బిజెపి ఓర్వలేక పోతుందా? అంటూ ప్రశ్నించారు.మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యానాలతో అవహేళన చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు. వ్యక్తిత్వహరణం చేయడం బిజెపికి అలవాటుగా మారిందని మండిపడ్డారు.మహిళ హక్కుల గురించి మాట్లాడుతున్న వారి గొంతు నొక్కడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఇతరులపై నిందలు వేయడం మానుకొని పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి కృషి చేయాలని బిజెపిని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News