Friday, April 26, 2024

డిగ్రీదాదా రాస్ జోష్ @71..

- Advertisement -
- Advertisement -

లండన్ : ఈ మహానుభావుడి జీవితమున సగభాగం డిగ్రీకే సరిపోయెను. అయినా పట్టువదలని విక్రమార్కుడాయెను. ప్రపంచపు అత్యంత మంద విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. 71 సంవత్సరాల అర్థూర్ రాస్ తమ డిగ్రీ అనబడు పట్టభద్రతను సాధించేందుకు 54 సంవత్సరాలు పట్టింది. యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా(యుబిసి) నుంచి రాస్ రెండు రోజుల క్రితం తమ డిగ్రీ పట్టా లేట్‌వయస్సులో మరీ లేటెస్టుగా పుచ్చుకుని కాలరేగరేశాడు. సాధారణంగా చూస్తే 71 ఏండ్ల వయస్సులో మనసో దిక్కు తనువో చిక్కుగా మారిన దశతిరుగుడు దిశకు చేరినప్పుడు కూడా అలుపుసొలుపులేక కేవలం తాను తన ముందు అందుకోవల్సిన డిగ్రీ ఈ రెండింటిపైనే ధ్యాస పెట్టి చిట్టచివరికి ఈ పట్టాదారుడయ్యాడు. సుదీర్ఘకాలం తరువాత పట్టాపుచ్చుకున్న ఘనత వహించాడు.

54 ఏండ్ల కాలం చదివి డిగ్రీ తీసుకోవడం ఇప్పుడు ప్రపంచ వివిధ రకాల పరీక్షల్లో ఇది రికార్డు అయింది. సాధారణంగా వర్శిటీల నుంచి డిగ్రీలతో బయటకు వెళ్లడానికి రెండు మూడు ఏండ్లు పడుతుంది. అయితే తన బుద్ధిని సరైన విధంగా తన శక్తిమేరకు వినియోగించుకుంటూ పరీక్షలు రాస్తూ విఫలమవుతూ ఉన్నప్పటికీ చిట్టచివరికి తన లక్షం నెరవేర్చుకున్నాడు. తాబేటి టైపు స్టూడెంట్‌కు డిగ్రీ ఇచ్చిన యుబిసి అని ఇప్పుడు లండన్ పత్రికలు వార్తలు వెలువరించాయి. రాస్ 1969లో యుబిసిలో డిగ్రీలో చేరారు. అప్పటి నుంచి ఆయనది అలుపెరుగని ప్రస్థానం అయింది. తనకు చదువుపై ఆసక్తి ఉండటంతో ఎంత ఇబ్బంది అయినా ముందుకు సాగానని, ఇప్పుడు ఇన్నేళ్లకు అయినా డిగ్రీతీసుకున్నందుకు తనకు ఆనందంగానే ఉందని రాస్ బిబిసి ఇంటర్వూలో తెలిపారు.

రాస్ ముందు ఆంగ్ల భాషలో డిగ్రీ చేయాలని సంకల్పించారు. తరువాత ఆయన దృష్టి నాటకరంగ సబ్జెక్టుపై మళ్లింది. దీనితో సాధ్యమైనంత ఎక్కువసేపు థియేటర్ విభాగంలోనే గడిపాడు. నటుడు కావాలనే ఆలోచనతో ఈ డిగ్రీని పొందేందుకు యత్నిస్తూ ఇంతకాలం సాధ్యమైనని సార్లు షోలు చేశానని కూడా తెలిపారు. తరువాత ఆయన దృష్టి హిస్టరీపై మళ్లింది. ప్రపంచ చరిత్ర ప్రధానంగా చేసుకుని ఇప్పుడు ఈ డిగ్రీ దక్కించుకుని తన ప్రత్యేకతను ప్రపంచానికి చాటాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News