Thursday, May 8, 2025

నిరాశే మిగిలింది… తేలిపోయిన సన్ రైజర్స్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్ 2025లో కిందటి రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. భారీ ఆశలతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ చెత్త ఆటతో నాకౌట్‌కు చేరకుండానే నిష్క్రమించింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ మూడు విజయాలు మాత్రమే సాధించింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. దీంతో ఏడు పాయింట్లు మాత్రమే సాధించిన హైదరాబాద్ ప్లేఆఫ్‌కు దూరమైంది. ఢిల్లీ క్యా పిటల్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ వ ర్షం వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఈ మ్యాచ్ ర ద్దు కావడంతో హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలకు తెరపడింది. 2024లో అసాధారణ ఆటతో ఫైనల్ వరకు దూసుకొచ్చిన సన్‌రైజర్స్ ఈసారి మాత్రం అత్యంత పేలవమైన ప్రదర్శనతో తేలిపోయింది.

బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం జట్టుకు శాపంగా మారింది. వి ధ్వంసక బ్యాటర్లుగా పేరున్న అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ రెడ్డి తదితరులు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడం లో విఫలమయ్యారు. ముఖ్యంగా అభిషేక్, ఇషాన్, హెడ్‌లు ఒకటి రెండు మ్యాచుల్లో తప్పిస్తే పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. పంజాబ్‌పై అభిషే క్, రాజస్థాన్‌పై ఇషాన్‌లు కళ్లు చెదిరే శతకాలు త ప్పించి సన్‌రైజర్స్ టీమ్ నుంచి పెద్దగా బ్యాటింగ్ వి న్యాసాలు కనిపించలేదు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే అభిషేక్, హె డ్‌లు ఈసారి పూర్తిగా నిరాశ పరిచారు. వీరిపై జ ట్టు భారీ ఆశలు పెట్టుకున్నా పెద్దగా ఫలితం లేకుం డా పోయింది. కిందటి సీజన్‌లో చిరస్మరణీయ బ్యాటింగ్‌తో ఐపిఎల్‌లో ఎన్నో రికార్డులను తిరగ రాసిన ఈ జోడీని 2025లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది.

ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు జరగగా ఒ క్క పంజాబ్ మ్యాచ్‌లో మాత్రమే ఈ జోడీ మెరుగైప ఆరంభాన్ని అందించింది. మిగతా మ్యాచుల్లో పూ ర్తిగా విఫలమైంది. వీరి వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపించింది. ఇక భారీ ఆశలు పెట్టుకు న్న ఇషాన్ కిషన్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే జట్టుకు అండగా నిలిచాడు. మిగతా అన్ని మ్యాచుల్లోనూ చె త్త ఆటతో నిరాశ పరిచాడు. జట్టుకు అండగా నిలుస్తాడని భావిస్తే ఇషాన్ మాత్రం అంచనాలకు తగినట్టు రాణించలేక పోయాడు. నితీశ్ కుమార్ రెడ్డి కూడా పేలవమైన బ్యాటింగ్‌తో సతమతమయ్యా డు. అతను కూడా పూర్తిగా నిరాశే మిగిల్చాడు. ఏ మ్యాచ్‌లోనూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోయాడు. హెన్రిచ్ క్లాసెన్ ఒక్కడే కాస్త నిలకడగా బ్యాటింగ్ చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో సన్‌రైజర్స్‌కు నిరాశ తప్పలేదు.

తేలిపోయిన షమి

ఇక బౌలింగ్‌లోనూ హైదరాబాద్ పూర్తిగా చేతులెత్తేసింది. భారీ ఆశలు పెట్టుకున్న స్టార్ బౌలర్ మహ్మ ద్ షమి అత్యంత చెత్త బౌలింగ్‌తో నిరాశ పరిచాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా అతను జట్టుకు అండగా నిలువలేక పోయాడు. షమి వైఫల్యం కూడా హైదరాబాద్ పేలవమైన ప్రదర్శనకు ఒక కారణంగా చెప్పొచ్చు. కెప్టెన్ కమిన్స్, హర్షల్ పటేల్‌లు మాత్రమే కాస్త మెరుగ్గా బౌలింగ్ చేశారు. ఇతర బౌలర్లు తేలిపోవడంతో హైదరాబాద్‌కు ఇ బ్బందులు తప్పలేదు. మొత్తం మీద ఈ సీజన్ సన్‌రైజర్స్ టీమ్‌కు కలిసి రాలేదనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో నాకౌట్‌కు చేరకుండానే ఇంటిదారి పట్టక తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News