Wednesday, May 15, 2024

ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ మరో ఐదు వారాలు పొడిగిస్తూ సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్ నిందితుడిగా ఉన్నారు. జస్టిస్‌లు ఎఎస్ బోపన్న, బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనానికి జైన్ అనారోగ్య పరిస్తితిని జైన్ తరఫున హాజరైన న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వివరించారు. ఈ నెల 21న జైన్‌కు వెన్నుపూస సర్జరీ జరిగిందని,

కోలుకోడానికి కొంత వ్యవధి పడుతుందని వివరించారు. దీనిపై ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు బెయిల్ పొడిగింపును తాను తిరస్కరించడం లేదని వివరించారు. తదుపరి విచారణ తేదీ కోసం జైన్ నుంచి ఎయిమ్స్ లేదా మరే ఆస్పత్రి నుంచైనా దరఖాస్తును ఈడీ కోరుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఐదు వారాల పాటు విచారణ వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News