Wednesday, May 1, 2024

ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఊరట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు సోమవారం ఊరటనిచ్చింది. వైద్య కారణాలతో సత్యేంద్ర జైన్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను కోర్టు అక్టోబర్ 8 వరకు పొడిగించింది. జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం మరోసారి అక్టోబర్ 9న విచారించనున్నది. ఇంతకు ముందు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను ఈ నెల 25 వరకు పొడిగించింది. సత్యేంద్ర జైన్‌కు జూలై 21న శస్త్రచికిత్స జరిగింది. వైద్యపరమైన కారణాలతో మధ్యంతర బెయిల్‌ను కోర్టు పొడిగించింది. మనీలాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్‌కు మే 26న సుప్రీంకోర్టు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు అనుమతి ఇచ్చిన కోరు సాక్షులను ప్రభావితం చేయొద్దని హెచ్చరించింది. అలాగే, అనుమతి లేకుండా ఢిల్లీ దాటి బయటకు వెళ్లకూడదని, మీడియాతో మాట్లాడొద్దని స్పష్టం చేసింది. వాస్తవానికి సత్యేందర్ జైన్ 202 మే 31 నుంచి మనీలాండరింగ్ కేసులో కస్టడీలో ఉన్నారు. ఏప్రిల్ 6న ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించగా.. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సత్యేందర్ జైన్ మే 25న తీహార్ జైలులోని వాష్‌రూంలో జారిపడిపోయారు. అనంతరం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు.

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News