Tuesday, October 15, 2024

కేజ్రీవాల్‌కు బెయిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. ఈ స్కామ్‌లో సిబిఐ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు చట్టబద్ధత కాదా అనే విషయంలో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తెలిపింది. సుదీర్ఘ జైలు శిక్ష స్వేచ్ఛను హరించడమే అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి వ్యాఖ్యలు చేయవద్దని సిఎం కేజ్రీవాల్‌కు షరతు విధించింది. పది లక్షల రూపాయల బాండ్లు, ఇద్దరి పూచీకత్తుతో కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21 రాత్రి ఆమ్ ఆద్మీపార్టీ నేత, సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఇడి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా, ఎంఎల్ సి కవితకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News