Tuesday, September 10, 2024

ఢిల్లీ మద్యం కేసులో సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ మద్యం కేసులో సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సిసోడియా పాస్ పోర్టును సరెండర్ చేయడంతో పాటు దేశం విడిచి వెళ్లొద్దని కోర్టు తెలిపింది. సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరని ధర్మాసనం పేర్కొంది. విచారణలో పురోగతి లేకపోతే పరిమితి దాటక జైలులో ఉంచలేరని, జైలులో ఉంచాలనుకుంటే ఆ వ్యక్తి హక్కులు హరించడమేనని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. బెయిల్ అప్లికేషన్ పెట్టడం, బెయిల్ పొందడం వారి హక్కు అని స్పష్టం చేసింది. సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దన్న దర్యాప్తు సంస్థల వాదనలను తోసిపుచ్చింది. ట్రయల్ వేగంగా జరిగేందుకు సిసోడియా సహకరించాలని సుప్రీ ఆదేశాలు జారీ చేసింది. సిసోడియా జైలు నుంచి బయటకు రావడంతో ఆప్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 2023 ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన బాస్ అరవింద్ కేజ్రీవాల్, ఎంఎల్ సి కవితను కూడా మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేశారు. వీళ్లతో పాటు మరో 12 మందిని లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News