Wednesday, December 4, 2024

తెగిన సంబంధాలు ఆత్మహత్యకు ప్రేరేపణ కాలేవు: సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

తెగిన సంబంధాలు భావోద్వేగపూరితం అయినప్పటికీ క్రిమినల్ నేరానికి పురికొల్పే ఉద్దేశం లేనట్లయితే, అవి నేరుగా ఆత్మహత్యకు ప్రేరేపణ కాలేవని సుప్రీం కోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. ఐపిసి కింద వంచన,ఆత్మహత్యకు పురికొల్పిన నేరాలకు కమరుద్దీన్ దస్తగిర్ సనాదిని దోషిగా కర్నాటక హైకోర్టు నిర్ధారించడాన్ని తోసిపుచ్చుతూ ఇచ్చిన ఒక తీర్పులో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు పంకజ్ మిత్తల్, ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం ఆ అభిప్రాయం వెలిబుచ్చింది. ‘ఇది తెగిన సంబంధం కేసే గాని నేరపూర్వక ప్రవర్తన కాదు’ అని తీర్పు పేర్కొన్నది. సనాదిపై మొదట ఐపిసి సెక్షన్లు 417 (వంచన), 306 (ఆత్మహత్యకు ప్రేరేపణ), 376 (అత్యాచారం) కింద అభియోగాలు మోపారు. విచారణ కోర్టు అతనికి అన్ని అభియోగాల నుంచి విముక్తి కల్పించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌పై కర్నాటక హైకోర్టు అతనిని వంచన,

ఆత్మహత్యకు ప్రేరేపణ నేరానికి నిర్ధారించి, ఐదు సంవత్సరాల కారాగార శిక్ష, రూ. 25 వేల జరిమానా విధించింది. తల్లి విజ్ఞప్తి మేరకు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ఆమె 21 ఏళ్ల కుమారెత గత ఎనిమిది సంవత్సరాల పాటు నిందితుని ప్రేమించింది, అతను పెళ్లి చేసుకుంటానన్న వాగ్దానాన్ని పాటించకపోవడంతో 2007 ఆగస్టులో ఆత్మహత్య చేసుకుంది. జస్టిస్ మిత్తల్ 17 పేజీల తీర్పు రాస్తూ, ఆ యువతి రెండు మరణవాఙ్మూలాలను విశ్లేషించారు. ఆ జంట మధ్య శారీరక సంబంధం గురించిన ఆరోపణ గానీ, ఆత్మహత్యకు దారి తీస్తూ ఉద్దేశపూర్వక చర్య గానీ లేదని ఆయన పేర్కొన్నారు. తెగిన సంబంధాలు భావోద్వేగపూరితమైనవని, అయితే అవి క్రిమినల్ నేరాలకు నేరుగా పురికొల్పేవి కావని జస్టిస్ మిత్తల్ ఆ తీర్పులో తెలిపారు. బలవన్మరణానికి ఆమెను అతను పురికొల్పాడనేందుకు ఏ ఆధారమూ లేదని, సుదీర్ఘ అనుబంధం తరువాత కూడా పెళ్లికి నిరాకరించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని తీర్పు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News