Thursday, April 18, 2024

యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

- Advertisement -
- Advertisement -

ఇసి ఆదేశంతో నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికల విధుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఫిర్యా దు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఎ. భాస్కర్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయనను విధుల నుంచి స్పస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకే ప్రాంతంలో గత మూడేళ్లు గా పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఈ మేరకు జిల్లా అధికారులను వారు ఎన్నేళ్లుగా ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలో విధులు నిర్వర్తిస్తున్నారో పూర్తి వివరాలను ఇవ్వాలని కోరింది. ఈ క్రమంలోనే అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రా వు సిఇసిని తప్పుదోవ పట్టించేలా తప్పుడు రి పోర్టును అందజేశారు. ప్రస్తుతం తాను పని చేస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఇంకా మూ డేళ్లు కాలేదని ఇంకా నాలుగు నెలలు ఉందం టూ ఫేక్ రిపోర్టును పంపారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న సిఇసి భాస్కరరావును సస్పెండ్ చేయాలంటూ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News