Saturday, April 27, 2024

హ్యాట్రిక్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

T20 World Cup 2022: IND vs SA Match Today

పెర్త్: టి20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలను అందుకోవాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా రెండో మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌ను చిత్తుగా ఓడించింది. ఇక సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లోనూ విజయమే లక్షంగా పెట్టుకుంది. అయితే కిందటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. డికాక్, రొసొలు ఫామ్‌లో ఉండడం సౌతాఫ్రికాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. మరోవైపు టీమిండియా కూడా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా ఉంది. అయితే ఓపెనర్ కెఎల్ రాహుల్ ఫామ్ ఒక్కటే జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ను ఆడిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో రాహుల్‌కు బదులు రిషబ్‌పంత్‌ను బరిలోకి దించుతామనే సంకేతాలను జట్టు బ్యాటింగ్ కోచ్ ఇచ్చాడు. దీంతో ఈ మ్యాచ్‌లో రాహుల్ బెంచ్‌కే పరిమితమైన ఆశ్చర్యం లేదు.
అదరగొడుతున్నారు..
మరోవైపు టీమిండియా టాప్ ఆర్డర్ జోరుమీదుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, యువ సంచలనం సూర్యకుమార్ యాదవ్‌లు అర్ధ సెంచరీలతో అలరించారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో చెలరేగిన విరాట్ కోహ్లి నెదర్లాండ్స్‌పై కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. సౌతాఫ్రికాపై కూడా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. రోహిత్ చెలరేగితే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. ఇక సూర్యకుమార్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతను జట్టుకు కీలకంగా మారాడు. హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక భువనేశ్వర్, అర్ష్‌దీప్, అశ్విన్, షమిలతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తక్కువ అంచనా వేయలేం
ఇక సౌతాఫ్రికాను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. డికాక్, రొసొలు ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. డికాక్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ సత్తా చాటాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో రొసొ కళ్లు చెదిరే శతకంతో ఆకట్టుకున్నాడు. అయితే మార్‌క్రామ్, కెప్టెన్ బవుమా, ట్రిస్టన్ స్టబ్స్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇది జట్టును కలవరానికి గురి చేస్తోంది. మరోవైపు రబడా, పార్నెల్, నోర్జే, షంసి, మహారాజ్‌లతో బౌలింగ్ చాలా బలంగా ఉంది. దీంతో టీమిండియాకు ఈ మ్యాచ్‌లో గట్టి పోటీ ఎదురు కావడం ఖాయం.

T20 World Cup 2022: IND vs SA Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News