Tuesday, April 30, 2024

కమలం ‘డర్టీ గేమ్’

- Advertisement -
- Advertisement -

అమిత్ షాను అరెస్టు చేయాలి

సైబరాబాద్‌లో బిజెపి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది హోం మంత్రి అమిత్‌షాను అరెస్టు
చేయాలి ఎంఎల్‌ఎల కొనుగోలుకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది ఢిల్లీలో
మా ప్రభుత్వంపై కుట్ర జరిగిందని హైదరాబాద్ ఆడియో క్లిప్‌తో తేలిపోయింది
విచారణ చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా

న్యూఢిల్లీ: తెలంగాణలో టిఆర్‌ఎస్ ఎం ఎల్‌ఎలకు బిజెపి ఎర వ్యవహారంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సి సోడియా శనివారం తీవ్రంగా స్పందించారు. ఈ ఉదంతానికి సంబంధించి వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను అరెస్టు చేయాలని సిసోడియా డి మాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతోన్న ‘ఆపరేషన్ లోటస్’ తెలంగాణలో కూడా బహిరంగంగానే చేపట్టారని, న లుగురు ఎంఎల్‌ఎలను బిజెపిలోకి చేర్చుకోవడానికి బేరసారాలు జరిగినట్లు బ యటపడిందన్నారు. ఇందులో అమిత్ షా పాత్ర ఉందని ప్రాథమికంగా తెలుస్తున్నందున, ఇది నిజమే అయితే కేంద్ర హోం మంత్రి అయిన అమిత్ షాను అ రెస్టు చేయాల్సి ఉంటుందని సిసోడియా స్పష్టం చేశారు. బిజెపియేతర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు పావులు కదప డం, అనైతికంగా వ్యవహరించడం బిజెపికి పరిపాటి అయిందని సిసోడియా మండిపడ్డారు. గతంలో ఢిల్లీ, పంజాబ్, మరో ఎనిమిది రాష్ట్రాలలో ఇలాగే చేసి ప్రభుత్వాలను పడగొట్టి అక్రమంగా అ ధికారంలోకి వచ్చారన్నారు.

ఇది బిజెపి సాగిస్తోన్న చెత్తపని(డర్టీ గేమ్) అని, అ ది తెలంగాణలో మరింతగా బహిర్గతం అయిందని విమర్శించారు. ఎంఎల్‌ఎలను కొనడానికి బిజెపికి ఇంత పెద్ద మొ త్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తోందన్నా రు. బిజెపియేతర రాష్ట్రాల్లో ఈడీ, ఐటి, సిబిఐదాడులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. బిజెపిలో చేరితే ఏ ద ర్యాప్తు ఏజెన్సీలు మిమ్మల్ని ఏమీ చేయలేవని భరోసా ఇసున్నారని, లేకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తున్నారని అన్నారు. తెలంగాణలో బిజెపి సాగించి న ఆటలో భాగంగా ఆడియో క్లిప్‌లలోని సంభాషణలను సిసోడియా ప్రస్తావించారు. ముగ్గురు వ్యక్తుల మధ్య సంభాషణ జరిగింది. ఇందులో మాట్లాడిన ఓ వ్యక్తి మధ్యలో షా జీ అనే పేరు ప్రస్తావించారు. ఈ షా ఎవరు? ఈ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంతో ఆయనకు ఎటువంటి సంబంధం ఉంది? ఈ షా నిజంగానే అమిత్ షా అయి ఉంటే వెంటనే ఆయనను అరెస్టు చేయాలి, ఇంటరాగేట్ చేయాలన్నారు.

దేశ హోం మంత్రి పేరు ఈ వ్యవహారంలో ప్రస్తావనకు వచ్చిందని, మరి దేశానికి, ప్రజాస్వామ్యానికి ఇంతకంటే ప్రమాదకరమైన విషయం మరోటి ఉంటుందా? అని సిసోడియా ప్రశ్నించారు. సైబరాబాద్‌లో పట్టుబడిన రామచంద్ర భారతీ, సింహయాజులు, నందకుమార్‌లకు కేంద్రంలోని పెద్దలకు, ప్రత్యేకించి బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కక్షగా వ్యవహరిస్తూ వస్తున్న అమిత్ షాకు ఎటువంటి సంబంధం ఉందో బయటికి రావాలన్నారు. ఇటీవల తెలంగాణలో పర్యటించినప్పుడు అమిత్ షా టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారని, కెసిఆర్ ప్రభుత్వం కుప్పకూలుతుందని కూడా హెచ్చరించారని సిసోడియా గుర్తు చేశారు. ఈ కోణంలో అక్కడ జరిగే ఉప ఎన్నికల నేపథ్యంలో ఆపరేషన్ లోటస్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారని , బిజెపి వ్యవహారాలు ఈ విధంగా వెర్రితలలు వేస్తున్నాయని విమర్శించారు. రాజకీయాలను బిజెపి ఎటునుంచి ఎటు తీసుకుపోతోందని సిసోడియా దుయ్యబట్టారు.

ఢిల్లీ ప్రభుత్వంపై కుట్రకు ఇదిగోండి సాక్షం…

ఈ ఏడాది ఆగస్టులో బిజెపి పెద్దలు తమ ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్రలు పన్నారని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఇస్తామని బేరాలకు దిగారని ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించుకోవల్సి ఉంటుందని సిసోడియా తెలిపారు. అయితే ఆప్‌పై కుట్ర వార్తలను బిజెపి ఖండించింది. ఎమ్మెల్యేలను బెదిరించడం లేదా కేసులు పెట్టి వేధించడం కాకపోతే బేరసారాలకు దిగడం బిజెపి తంతు అయిందని, ఢిల్లీలో తమ ప్రభుత్వంపై బిజెపి సాగించిన దుష్ట చర్యకు సంబంధించినవీడియో ఆడియో సాక్షాలు ఆప్ వద్ద భద్రంగా ఉన్నాయని సిసోడియా ఇప్పుడు వివరించారు. పైగా ఇప్పుడు తెలంగాణలో వెలుగులోకి వచ్చిన ఆడియోలో కూడా ఏజెంట్లు తాము ఇంతకు ముందు ఢిల్లీలో కూడా ఆపరేషన్ చేశామని చెప్పినట్లు ఉందని, దీనిని ఆగస్టు పరిణామాల నేపథ్యంలో పరిగణనలోకి తీసుకోవాలని సిసోడియా డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఏకంగా 43 మంది ఆప్ ఎమ్మెల్యేలను బిజెపిలోకి లాగేందుకు బిజెపి పెద్ద విఫలయత్నంచేశారని విమర్శించారు.

తెలంగాణలో బిజెపి కుట్ర బట్టబయలు : ఆప్ ఎంపి సంజయ్ సింగ్

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు బిజెపి ఆధ్వర్యంలో ఆపరేషన్ లోటస్ జరుగుతోందని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్ శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు బిజెపి ప్రయత్నాలు చేసిందని మండిపడ్డారు. వందల కోట్లు ఎంఎల్‌ఎలకు ఎర వేసి టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేశారని అన్నారు. బిజెపి తెలంగాణలో కేవలం ముగ్గురు ఎంఎల్‌ఎలు మాత్రమే ఉన్నారని, టిఆర్‌ఎస్ కు 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని సంజయ్ సింగ్ గుర్తు చేశారు.

ఢిల్లీ ఎంఎల్‌ఎలను కూడా కొనేందుకు బిజెపి దళారులు ప్రయత్నాలు చేస్తున్నారని, 43మంది ఎంఎల్‌ఎలు తమతో టచ్ లో ఉన్నారని, సంప్రదింపులు జరుపుతున్నామని అడియోలో చెప్పడమే దానికి నిదర్శనమన్నారు. బిజెపి ఓ కిడ్నాప్ గ్యాంగ్‌లా తయారైందని దుయ్యబట్టారు. ఓ గ్యాంగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వాలను కూల్చే కుట్రలకు తెరలేపుతున్నారని సంజయ్ సింగ్ అన్నారు. తెలంగాణలో బయటపడ్డ ఆడియోలో అమిత్ షా పేరు కూడా బయటపడిందని, ఆ పార్టీ ప్రముఖుడు బిఎల్ సంతోష్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందన్నారు. హోంమంత్రి నాయకత్వంలోనే కిడ్నాప్ గ్యాంగ్ నడుస్తోందంటే ఇంతకన్నా దారుణం మరోటి లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News