Friday, March 29, 2024

ఔరంగజేబు సమాధిని హైదరాబాద్‌కు పట్టుకుపోండి: శివసేన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

ఛత్రపతి శంభాజీనగర్: ముఘల్ చక్రవర్తి ఔరంగాజేబ్ సమాధిని మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్(పూర్వ ఔరంగాబాద్) నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తరలించాలని అధికార శివసేన ఎమ్మెల్యే సంజయ్ షిర్సత్ సోమవారం డిమాండ్ చేశారు. ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చడాన్ని నిరసిస్తూ ఎఐఎంఐఎం కార్యకర్తలు ఆమరణ నిరహారా దీక్షలు చేపట్టిన దరిమిలా నగర ఎమ్మెల్యే షిర్సత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు పట్ల అవారికి(ఎంఐఎం) అంత ప్రేమే ఉంటే ఆయన సమాధిని హైదరాబాద్‌కు మార్చుకుని, అక్కడే ఒక స్మారకాన్ని నిర్మించుకోవాలని, ఎవరూ వారిని అడ్డుకోరని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన వర్గానికి చెందిన ఎమ్మెల్యే షిర్సత్ వ్యాఖ్యానించారు.

కాగా..శివసేన ఎమ్మెల్యే షిర్సత్ వ్యాఖ్యలపై స్థానిక ఎంఐఎం అధ్యక్షుడు షరేఖ్ నక్ష్‌బంది స్పందించారు. శివసేన ఎమ్మెల్యే రాజకీయం చేస్తున్నారని, మతాల మధ్య వైషమ్యాలు సృష్టించడమే ఆయన ఉద్దేశంగా కనపడుతోందని షరేఖ్ ఆరోపించారు. ఔరంగజేబుపై అంత విద్వేషమే ఉన్నట్లయితే 1668లో ఔరంగజేబు కుమారుడు మొహమ్మద్ ఆజమ్ షా తన భార్య కోసం నిర్మించిన బీబీ కా ముఖాబరాకు జి 20 ప్రతినిధులను ఎందుకు తీసుకు వెళ్లి చూపించారని ఆయన ప్రశ్నించారు. గత పాలకుల పట్ల అంత శత్రుభావమే బిజెపి ప్రభుత్వానికి ఉన్న పక్షంలో తాజ్ మహల్(ఆగ్రా), ఇతర స్మారక చిహ్నాల నుంచి ఎందుకు డబ్బు వసూళ్లు చేసి ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారని షరేఖ్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News