Thursday, March 28, 2024

రి’పబ్లిక్’ వివాదం

- Advertisement -
- Advertisement -

రిపబ్లిక్ వేడుకల్లో గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలు పెను వివాదం సృష్టించాయి. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన గవర్నర్.. పుదుచ్చేరి వెళ్లి నేరుగా తెలంగాణ సర్కార్‌పైనే ఆరోపణాస్త్రాలు సంధించారు. దీంతో రాష్ట్ర మంత్రులు, చట్టసభల అధిపతులు, బిఆర్‌ఎస్ కీలక నేతలు గవర్నర్‌పై నిప్పులు చెరిగారు. పర్యవసానంగా రిపబ్లిక్ డే ఉత్సవం కాస్తా పబ్లిక్ వివాదంగా మారింది. విమర్శలు, ప్రతి విమర్శలు వారి మాటల్లోనే…

రాజ్‌భవన్‌లో పరోక్ష విమర్శ
అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదు. జాతి నిర్మా ణం. ఫామ్‌హౌస్‌లు కొందరికి కాదు. ఫామ్‌లు, హౌస్‌లు అందరికీ ఇవ్వాలి. మెరుగైన విద్య అంటే మన పిల్ల ల్ని విదేశాలకు పంపడం కాదు. మన దగ్గరే ప్రపంచస్థాయి ప్రమాణాలున్న విద్యా సంస్థల్లో చదివించాలి. ఇక్కడ ఆందోళన పరిస్థితులు నెలకొ న్నాయి. రోజుకు 22 మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేను కొంతమందికి నచ్చకపోవచ్చు. కాని, తెలంగాణ అంటే నాకెంతో ఇష్టం. ఈ రాష్ట్రంతో అనుబంధం మూడేళ్లది కాదు. పుట్టుక నుంచి ఉంది. ఇష్టమైన తెలంగాణ అభ్యున్నతి కోసం ఎంతైనా కష్టపడతాను.

పుదుచ్చేరిలో నేరుగానే దాడి

రాజ్యాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం అగౌరవ పరిచిన తీరు చరిత్రలో నిలిచి పోతుంది.తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. తెలం గాణలో రిపబ్లిక్ డే ప్రజల మధ్య జరగకుండా చూడాలని ప్రయత్నిం చారు. కానీ రాజ్యాంగంపై ప్రేమ ఉన్న శ్రేయోభిలాషి కోర్టుకు వెళ్తే పరేడ్ జరపాల్సిం దేనని కోర్టు ఆదేశించింది. ఆదేశాల తరువాత సిఎస్, డిజిపిని పంపి రిపబ్లిక్ డేను రాజ్‌భవన్‌లోనే నిర్వహిం చమని చెప్పారు. నిజానికి రెండు నెలల క్రిత మే ప్రభుత్వానికి ఈసారి రిపబ్లిక్ డే ఘనంగా జరపాలని లేఖ రాసాను. పట్టించుకోలేదు. ఈ విషయంలో కేంద్రం ఆదేశాలను కూడా పక్కన పెట్టారు. రిపబ్లిక్ డే రాజ్‌భవన్‌లో జరపుకున్నా, ప్రసంగ పాఠం ప్రతి పంపలేదు. సిఎం వస్తారని నేనేమీ ఊహించలేదు. అయినా ప్రజల మధ్య దేశభక్తి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నేను ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించా.

రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం

రాజకీయాలు మాట్లాడడం తగదు. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా గవర్నర్ మాట్లాడారు. ఆమె వైఖరిపై త్వరలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేస్తాం. గవర్నర్ విషయంలో రాష్ట్రపతి కల్పించుకోవాలి.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరైంది కాదు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును రాజకీయాలకు ఉపయోగించడం తగదు.
                                                                                      మంత్రి తలసాని

సెంట్రల్ విస్టా మాటేమిటి?

కరోనా లాంటి క్లిష్ట సమయం లో సెంట్రల్ విస్టా మీద కంటే.. దేశ మౌలిక సదుపాయాల మీద దృష్ఠి పెట్టాలని పలుమార్లు బిఆర్‌ఎస్ పార్టీ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇలాంటి ప్రత్యేకమైన రోజున, సిఎం కెసిఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా రైతు కూలీలు, నిరుద్యోగ యువత అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాం.
                                                                                ఎంఎల్‌సి కవిత

బాధ్యతగా ఉండాలి
దేశాన్ని పాలించే వ్యక్తులు రాజ్యాంగ స్ఫూర్తితో పని చేయాలి. కొందరి కోసం పనిచేయడం రాజ్యాంగ విరుద్దం. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి. మైకులు అందగానే ఆరోపణలు చేయ వద్దు. స్పీకర్ అయినా, ప్రధాని అయినా రాజ్యాంగం పరిధిలోనే పదవులు వచ్చాయని, కొంతమంది కళ్లలో సంతోషం కోసం పరిపాలన చేయవద్దు. దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉంది. పేదలకు పెద్ద పీట వేయాలి.
                                                                                             అసెంబ్లీ స్పీకర్ పోచారం

గవర్నర్ వ్యవస్థకే మచ్చ
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మాట్లాడటం ఏమిటి. ఇది గవర్నర్ వ్యవస్థకే మాయని మచ్చ. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే గవర్నర్ విమర్శలు చేస్తున్నారు. కొందరికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కళ్లకు కనపడటం లేదు. వాళ్లందరూ కళ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారు.
                                                                           మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News