Tuesday, December 3, 2024

నడిరోడ్డుపై బిజెపి నేత నరికివేత

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో బిజెపి నేత శంకర్ దారుణహత్యకు గురయ్యాడు. శంకర్‌పై నాటు బాంబులు, కత్తులతో దుండగులు దాడి చేశారు. బిజెపి ఎస్‌సి, ఎస్‌టి విభాగం ఉపాధ్యక్షుడిగా శంకర్ వ్యవహరిస్తున్నారు. వరకుపూరమ్ ప్రాంతానికి చెందిన శంకర్ ఓ పెళ్లి వేడుకలో పాల్గొని నసరాత్‌పేట్ నుంచి పువిందవల్లికి వెళ్తుండగా అతడి కారుపై బాంబులతో దాడి చేశారు. కారులో నుంచి బయటకు పారిపోతుండగా కత్తులతో శంకర్‌ను నరికి చంపారు. వెంటనే దుండగులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కిల్ పక్కమ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శంకర్ పై గతంలో 15 కేసులు ఉండడంతో పాటు అతడిపై రౌడీషీట్ ఉన్నట్టు సమాచారం.

Also Read: చిల్లర వాపసు అడిగితే చితకబాదిన మహిళా కండక్టర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News