Wednesday, May 1, 2024

చిల్లర వాపసు అడిగితే చితకబాదిన మహిళా కండక్టర్

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: సామాన్య పౌరుల పట్ల పోలీసులే కాదు బస్సు కండక్టర్లు కూడా అమానుషంగా ప్రవర్తిస్తారనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ, ఆమె పదేళ్ల కుమార్తెపై దౌర్జన్యం చేసిన కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కెఎస్‌ఆర్‌టిసి)కు చెందిన ఒక మహిళా కండక్టర్‌తోపాటు బస్సు డ్రైవర్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే…

Also Read: రూ. 121 కోట్ల బంగారం కంటెయినర్ ఏమైంది?

పుష్పలత(30 అనే గృహిణి, తన పదేళ్ల కుమార్తె, తన తల్లితో కలసి ఏప్రిల్ 23న మాండ్య జిల్లాలోని పంగడె కళ్లహల్లికి వెళ్లి బెంగళూరుకు తిరిగివస్తోంది. మూడు టికెట్ల ధర రూ. 218 కాగా పుషలత రూ. 500 నోటు కండక్టర్‌మమతకు ఇచ్చింది. రూ. 200 వాపసు చేసిన మమత టిక్కెట్ వెనుకవైపున రూ. 82 రాసి, బిహెచ్‌ఇఎల్ స్టాపు దగ్గర దిగేటప్పడు చిల్లర తీసుకోవాలని చెప్పింది.

అర్ధరాత్రి 12.15 గంటకు బస్సు కవిక లేఅవుట్ ఫ్లైఓవర్ చేరుకోగా చిల్లర వాపుసు చేయవలసిందిగా పుషలత మమతను కోరింది. అకారణంగా పుష్పలతపై మండిపడిన మమత ఆమెతో గొడవకు దిగింది. పుష్పలతపై చేయిచేసుకున్న మమత అడ్డువచ్చిన ఆమె పదేళ్ల కుమార్తెను కూడా కొట్టింది.బిహెచ్‌ఇఎల్ స్టాపు వద్ద బస్సు నిలపాల్సిన డ్రైవర్ ఉమేష్ ఆపకుండా ముందుకు తీసుకెళ్లాడు. 500 మీటర్ల తర్వాత బస్సు ఆపి ఆ ముగ్గురు ప్రయాణికులను బయటకు మెడపట్టి గెంటేశాడు.
గాయాలపాలైన తల్లీ కుమార్తెలు కెసి జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొంది మెడికో లీగల్ కేసు నమోదు చేశారు. బకచాతరాయనపుర పోలీసులు ఫిర్యాదు తీసుకుని కండక్టర్ మమత, డ్రైవర్ ఉమేష్‌పైన కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News