Tuesday, April 30, 2024

టాటా గ్రూప్ మార్కెట్ విలువ

- Advertisement -
- Advertisement -

పాక్ జిడిపి కంటే పెద్దది
టాటా కంపెనీల మార్కెట్ క్యాప్ 365 బిలియన్ డాలర్లు
పాకిస్తాన్ జిడిపి కేవలం 341 బిలియన్ డాలర్లు

ముంబై : టాటా గ్రూప్ మరో ఘనతను సొంతం చేసుకుంది. టాటా గ్రూప్ పొరుగు దేశం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను వెనక్కు నెట్టింది. ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ పాకిస్తాన్ జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) పరిమాణం కంటే పెద్దది. టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 365 బిలియన్ డాలర్లకు అంటే రూ.30.3 లక్షల కోట్లకు చేరుకుంది. మరోవైపు ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం, ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ జిడిపి కేవలం 341 బిలియన్ డాలర్లు మాత్రమే. టాటా గ్రూప్ కంపెనీల షేర్లు గతేడాది వేగంగా పెరిగాయి.

ఇన్వెస్టర్లకు మంచి రాబడులు కూడా ఇచ్చాయి. దీంతో టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. టాటా గ్రూప్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విలువ 170 బిలియన్ డాలర్లు దాటింది. ఇది పాకిస్థాన్ జిడిపిలో సగం ఉండడం గమనార్హం. పాకిస్తాన్ రుణం దాని జిడిపి కంటే వేగంగా పెరుగుతోందని ఇస్లామాబాద్ థింక్ ట్యాంక్ ట్యాబద్‌ల్యాబ్ ఒక నివేదికలో పేర్కొంది. దీని వల్ల ఉత్పత్తిని పెంచుకునే ఆర్థిక వ్యవస్థకు ఆటంకం ఏర్పడుతోంది. పాకిస్థాన్‌లో భారీ సంస్కరణలు చేపట్టాలి, ఇది జరగకపోతే ఆ దేశం మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఆ తర్వాత డిఫాల్ట్ పరిస్థితి ఏర్పడే అవకాశముంది. 2011 నుండి పాకిస్తాన్ విదేశీ రుణం దాదాపు రెట్టింపు కాగా, దేశీయ రుణం ఆరు రెట్లు పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్ దాదాపు 49.5 బిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

టాటా గ్రూపు 8 కంపెనీల సంపద రెట్టింపు
టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్, ట్రెంట్, టైటాన్, టిసిఎస్, టాటా పవర్ పనితీరు అద్భుతంగా ఉంది. గత ఏడాది కాలంలో గ్రూప్‌లోని 8 కంపెనీల సంపద దాదాపు రెట్టింపు అయింది. వీటిలో బెనారస్ హోటల్స్, టిఆర్‌ఎఫ్, ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా, ఆర్ట్‌సన్ ఇంజనీరింగ్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ కూడా ఉన్నాయి. దాదాపు రూ. 2.7 లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన టాటా క్యాపిటల్ తన ఐపిఒ వచ్చే ఏడాది ప్రారంభించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News