Sunday, April 28, 2024

హైవేలపై ట్రాక్టర్లను ఎలా నడుపుతారు: రైతులను ప్రశ్నించిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: మోటారు వాహనాల చట్ట నిబంధనల ప్రకారం ట్రాక్టర్ ట్రాలీలను హైవేలలో నడపడానికి వీల్లేదని పంజాబ్, హర్యానా హైకోర్టు మంగళవారం ఆందోళన చేస్తున్న రైతులకు తెలిపింది. ప్రాథమిక హక్కుల గురించే కాదు రాజ్యాంగ బాధ్యతలను కూడా పాటించాలని రైతులకు హైకోర్టు గుర్తు చేసింది. ట్రాక్టర్ ట్రాలీలలో అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి వెళుతున్నారని రైతులనుద్దేశించి కోర్టు పేర్కొంది. ప్రాథమిక హక్కుల గురించి అందరివీ తెలుసని, అదే ప్రకారం కొన్ని రాజ్యాంగపరమైన విధులను కూడా ప్రతిఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉంటుందని రైతుల నిరసనకు సంబంధించి దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు సూచించింది.

ప్రజలు పెద్ద సంఖ్యలో ఒక చోట గుమికూడకుండా చూడాలని పంజాబ్ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీచేసింది. వారికి(రైతులకు) నిరసన తెలిపే హక్కు ఉందని, సహేతుకమైన ఆంక్షలను కూడా విధించాల్సిన అవసరం ఉంటుందని కోర్టు పేర్కొంది. రైతుల రిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని కేంద్రం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ సమావేశాల వివరాలను పేర్కొంటూ తాజా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News