Monday, May 6, 2024

ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద తమిళనాడు రైతుల నిరసన

- Advertisement -
- Advertisement -

పంటలకు మద్దతుధర, నదుల అనుసంధానం కోసం డిమాండ్
ప్రభుత్వం వినకుంటే వారణాసిలో ప్రధాని మోడీపై పోటీ చేస్తామని హెచ్చరిక

న్యూఢిల్లీ : పంటలకు మద్దతు ధర కోరుతూ తమిళనాడుకు చెందిన రైతులు బుధవారం ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కపాలాలు, ఎముకలతో నిరసన తెలియజేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2019లో మోడీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు అమలు చేయలేదని రైతులు మండి పడ్డారు. నదుల అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కొందరు రైతులు చెట్లెక్కి, మరికొందరు మొబైల్ టవర్ ఎక్కి నిరసన తెలియజేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకుంటే వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా పోటీ చేస్తామని హెచ్చరించారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (న్యూఢిల్లీ ) దేవేష్ కుమార్ మహ్లా మాట్లాడుతూ దాదాపు 50 మంది రైతులు తమిళనాడు నుంచి వచ్చి నిరసన తెలిపారని, వీరిలో ఇద్దరు మొబైల్ టవర్ ఎక్కి ఆందోళన చేయగా వారిని కిందకు దించివేయడమైందని చెప్పారు. మరికొందరు చెట్లు ఎక్కడానికి ప్రయత్నించారన్నారు.

అయితే ఆందోళనలో దాదాపు 100 మంది రైతులు పాల్గొన్నారు. వ్యవసాయం ద్వారా రెట్టింపు ఆదాయం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు తమిళనాడు రైతులు చెప్పారు. అలాగే రూ.5000 వరకు పెన్షన్, వ్యక్తిగత బీమా, నదులను అనుసంధానం చేయడం తదితర డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. రైతులు నిరసన తెలుపుతున్నారని తమకు పిలుపు రాగానే జంతర్‌మంతర్ వద్దకు స్కై లిఫ్ట్‌తో వెళ్లామని, మొబైల్ టవర్ నుంచి రైతులను కిందకు దించామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ (డిఎఫ్‌ఎస్) సీనియర్ అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News