Sunday, September 15, 2024

సంచలన వీడియో.. ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేసిన టీడీపీ

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు
వీడియో విడుదల చేసిన ఓ మహిళ
పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ అధిష్టానం
తనను కుట్రలో ఇరికించారన్న ఆదిమూలం
సంచలన వీడియోపై స్పందించిన ఎమ్మెల్యే ఆదిమూలం

మన తెలంగాణ / అమరావతి: తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ మహిళ లేఖ రాశారు. ఎమ్మెల్యే వేధింపులను పెన్ కెమెరాలో రికార్డు చేసినట్లు ఆమె తెలిపారు. రాత్రి వేళల్లో మెసేజ్‌లు పంపి వేధించారని లేఖలో పేర్కొన్నారు. తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్‌కు పిలిపించి వేధించారని ఆరోపించారు. ఈ ఘటనను టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. దీనిపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

తనను కుట్రలో ఇరికించారు: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పలుమార్లు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఇవాళ సంచలన వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. తాను 24 గంటలూ ప్రజా సేవకుడ్ని. ఆమె పార్టీలో ఒక మహిళా అధ్యక్షురాలు. ఎన్నికల సమయంలో నాతో పాటు ప్రచారంలో తిరిగిందని తెలిపారు. ఇప్పుడు కావాలనే కుట్రపూరితంగా నాపై ఆరోపణలు చేస్తున్నారని, తాను కిందిస్థాయి నుంచి పైకి వచ్చినవాడ్ని అని, 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. ఆ మహిళ నా ప్రత్యర్థులతో చేరి కుట్ర పన్ని ఈ విధంగా ఆరోపణలు చేస్తోంది. ఆమెను నేను ఎక్కడా వేధించలేదని, ఆమెను ఓ సోదరి మాదిరిగా భావించానని స్పష్టం చేశారు.

టీడీపీ మండల ఇన్చార్జినంటూ ఆమె ఆర్నెల్ల పాటు తమతో తిరిగిందని వివరించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, విశ్వసనీయత ఉన్న వ్యక్తిని అని,ఆమె ఎలా వచ్చిందో, ఎలా పోయిందో తనకు తెలియదన్నారు. దేవుడి సాక్షిగా, నా బిడ్డల సాక్షిగా చెబుతున్నాను. నేను ఏమైనా తప్పు చేశానా లేదా అనేది ఆమెనే అడగండి. నా నియోజకవర్గంలో ఎవరినైనా అడగండి…నేను ఎలాంటివాడ్నో చెబుతారు. నేను తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు. అది మార్ఫింగ్ చేసిన వీడియో. కుట్రలో భాగంగానే ఆమెను వాడుకున్నారు. నేరుగా ఆమెతోనే చర్చించడానికైనా సిద్ధమని కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News