Friday, May 3, 2024

కదం తొక్కిన కోహ్లి, రాహుల్

- Advertisement -
- Advertisement -

చెలరేగిన కుల్దీప్.. పాకిస్థాన్‌పై టీమిండియా జయకేతనం
కొలంబో: ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్ర త్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన సూపర్4 మ్యాచ్‌లో టీమిండియా 228 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. సోమవారం రిజర్వ్‌డే రో జూ కూడా కొనసాగిన మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్‌మన్ గిల్ (58) అర్ధ సెంచరీలతో రా ణించారు.

మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కళ్లు చెదిరే శతకంతో అదరగొట్టాడు. కెఎల్ రా హుల్ కూడా అజేయ శతకంతో చెలరేగి పోయా డు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 94 బంతుల్లో నే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 122 పరుగులు చేశాడు. రాహుల్ 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 111 పరుగులు సాధించాడు. ఇద్దరు మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 233 పరుగు లు నమోదు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 32 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News