న్యూఢిల్లీ: విస్తారా (Vistara) సంస్థకు చెందిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి విజయవాడకు వెళ్లాల్సి విమానంలో సాంకేతిక లోపం జరగడంతో మూడు గంటల పాటు ప్రయాణికులు రన్‌వే పై ఎదురుచూశారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటలకు విస్తార విమాయం బయలుదేరాలి. అయితే సరిగ్గా టేకాఫ్ అయ్యే సమయంలో అకస్మాత్తుగా వేగం తగ్గించి పక్కకు తప్పించారు. ఆ తర్వాత ప్రయాణికులను రన్‌వేపై మూడు గంటలు ఉంచారు.
మధ్యాహ్నం 12 గంటలకు విమానం నుంచి కిందకు దించి పార్కింగ్ లాంజ్‌లో కూర్చోబెట్టారు. అయితే సమయం గడుస్తున్నా.. ప్రత్యాయ్నయా ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు చెబుతున్నారు. సిబ్బంది (Vistara) ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదని వాపోయారు. అయితే ఈ విమానంలోనే ఎపి హైకోర్టు జడ్జి బట్టు దేవానంద్‌కూడా కూడా ప్రయాణిస్తున్నారు. ఈ విమానంలో దాదాపు 160 మంది ప్రయాణికులు ఉన్నారు.