Friday, May 17, 2024

ఇండియాకు తిరిగొచ్చిన తైవాన్ ఎక్సలెన్స్ గేమింగ్ కప్ 2023

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నూతన ఈ స్పోర్ట్స్ ఛాంపియన్‌లకు పట్టం కట్టేందుకు తైవాన్ ఎక్సలెన్స్ గేమింగ్ కప్ (TEGC) 2023 భారతదేశానికి తిరిగి వచ్చింది. భారతదేశంలో సుదీర్ఘ కాలంగా నిర్వహించబడుతున్న ఈ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌ గా వెలుగొందుతున్న TEGC కు 2023లో 10 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సారి ఈ పోటీలను మరింత పెద్దగా నిర్వహించనుంది. ఇటీవలనే తైవాన్ ఎక్సలెన్స్ (TE) ఎలిమినేషన్ రౌండ్‌ల వివరాలను, గ్రాండ్ ఫినాలే, ఈ ఛాంపియన్‌షిప్ కు సంబంధించిన ఇతర ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం, మొదటిసారిగా, భారతదేశం నుండి మాజీ TEGC ఛాంపియన్‌లందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి TEGC ఇప్పటికే ప్రముఖ టెక్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది, ఇది TE YouTube హ్యాండిల్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ స్పోర్ట్స్‌లో మహిళల అపారమైన సహకారాన్ని గుర్తిస్తూ, TEGC భారతదేశంలోని టాప్ 10 మహిళా గేమర్‌ల మధ్య ఆసక్తికరమైన పోటీని నిర్వహించే ప్రణాళికలను సైతం ప్రకటించింది. నవంబర్‌లో జరగాల్సిన TEGC గ్రాండ్ ఫినాలే సమయంలోనే ఈ యుద్ధం జరుగుతుంది.TEGC యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ముంబై లోని తైపీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లైజన్ ఆఫీస్ డైరెక్టర్ (TAITRA- ముంబై) పోయి ఎడిసన్ హెసు మాట్లాడుతూ… “ఈ స్పోర్ట్స్ అంటే కేవలం గేమింగ్ మాత్రమే కాదు, అది ఒక అభిరుచి, ఒక వృత్తి, ఈ దేశంలోని కొన్ని ప్రకాశవంతమైన మనస్సులకు జీవన విధానం” అని అన్నారు. “తొలిసారిగా జరిగిన పోటీలో 500 మంది పాల్గొంటే, TEGC 10వ ఎడిషన్‌తో 25,000మంది యువ భారతీయ గేమర్‌లు ఛాంపియన్‌గా పోరాడతారని అంచనా వేయడం జరిగింది” అని ఎడిసన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News