Friday, September 13, 2024

హేళన చేసిన చోటే మన్నన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు సినిమా ల్లో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, ఈ ప్రాంత యాసలో చిత్రీకరిస్తున్న సినిమాలపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తెలంగాణలోని సాంస్కృతిక రంగంలో పునరుజ్జీవనానికి కారణమైన సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని కెటిఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణ యాసను హేళన చేసిన చోటే ఇప్పుడు కీర్తి దక్కుతుందని మంత్రి కెటిఆర్ తెలిపారు.

కెటిఆర్ ట్వీట్ నేపథ్యం ఇదే…

‘కెటిఆర్ సర్ మీతో నేను రెండు విషయాలుపంచుకోవాలనుకుంటున్నాను.తెలంగాణ యాసలో ఇప్పుడు సినిమాలు రావడం, అవి అద్భుతంగా ప్రజాదరణ పొందడంచూస్తుంటే సం తోషంగాఉంది.ఉదాహరణకుబలగం, దసరా లాంటి సినిమాలు. ఈ క్రెడిట్ అంతా కెసిఆర్ దక్కుతుంది’అని డా క్టర్ దండే శ్రీరాములు అనే వ్యక్తి కెటి ఆర్‌కు వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. అదేవిధంగా తనకు 68 ఏళ్లు, ఇలాంటి సినిమాలు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. తెలుగు సినిమాల్లో తెలంగాణ వారిని విలన్లు, జోకర్స్ గా చూపిచడంతో 20 ఏళ్ల నుంచి సినిమా థియేటర్లకు వెళ్లడం మానేశానని డాక్టర్ దండే శ్రీరాములు పేర్కొన్నారు.
ఈ సందేశంపై కెటిఆర్ స్పందిస్తూ సర్ మీ అభిప్రాయాన్ని నేను ట్వీట్ చేయొచ్చా..? అని అడిగారు. అది కూడా మీ అనుమతితో అని కెటిఆర్ అడగ్గా శ్రీరాములు కూడా పాజిటివ్‌గా స్పందించారు. సర్ తప్పకుండా మీరు ట్వీట్ చేస్తే నేను ఎంతో హ్యాపీగా ఫీలవుతాను. మీరు మమ్మల్ని అడగడం మీ మంచితనానికి నిదర్శనం. థాంక్యూ వెరీ మచ్ సర్ అంటూ శ్రీరాములు పేర్కొన్నారు. శ్రీరాములు వాట్సాప్ సందేశాన్ని కోట్ చేస్తూ మంత్రి కెటిఆర్ ఈ ఆసక్తికర ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News